కల్కి 2898AD సినిమా ఎందుకు ఎంత స్పెషల్… అందులో వాడిన టెక్నాలజీలు ఏంటి..?

ప్రభాస్( Prabhas ) కల్కి సినిమా( Kalki Movie ) కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు.ఆ తరుణం రాని వచ్చింది.

 New Technologies In Kalki Movie-TeluguStop.com

సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరే థియేటర్ కి వెళ్లి ఒక్కసారి అయినా దాన్ని అనుభవం చేసుకోవాల్సిన అవసరం ఉంది.ఎందుకంటే సినిమాలో వాడిన టెక్నాలజీ( Technology ) అలాంటిది.

ప్రపంచ సినిమాతో పోటీ పడుతూ ఒక తెలుగు సినిమా దర్శకుడు తన సత్తా ఏంటో అందరికీ రుజువు చేయాలనుకుంటున్నాడు.పైగా ఇప్పటి వరకు ఫ్యాన్ ఇండియా లేదా ప్రపంచ సినిమా ముందు ఇండియా నుంచి రాజమౌళి మాత్రమే తెలుసు.

కానీ అంతకు మించిన మరొక డైరెక్టర్ ఉన్నాడు అని నాగ్ అశ్విన్( Nag Ashwin ) గురించి అందరూ మాట్లాడుకోవాల్సిన తరుణం ఇది.

Telugu Ashwini Dutt, Bujji, Kalki, Keerthy Suresh, Nag Ashwin, Prabhas, Prabhas

ఈ సినిమాలో ఇప్పటివరకు ఏ దర్శకులు వాడనటువంటి కొన్ని అద్భుతమైన టెక్నాలజీలను వాడారు.6.5K క్వాలిటీతో ఈ సినిమా విడుదల కాబోతోంది అంటే పెద్ద తెర పై ఈ సినిమాను చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రేక్షకుడు ఒక కొత్త అనుభవాన్ని ఫీల్ అవుతాడు.ఇక 2d, 3d ఫార్మాట్ మనకు తెలిసిందే కానీ ఫారన్ లో 4డిఎక్స్ ఫార్మాట్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.అవి మనకు ఇండియాలో అవైలబుల్ లేవు.

ఇక నాలుగు కోట్లు పెట్టి బుజ్జి ( Bujji ) అనే ఒక కొత్త కారు ను సపరేట్ గా ఒక టెక్నాలజీ ఉపయోగించి తయారు చేశారు.దీనికి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పడం విశేషం.

ఇంతే కాకుండా సినిమాలో మూడు ప్రపంచాలను చూపించబోతున్నారు.అన్ని సౌకర్యాలు ఉన్న కాంప్లెక్స్ అలాగే శరణార్థులు ఉండే శంబలా మరియు నిర్జీవంగా మారుతున్న ప్రస్తుత ప్రపంచాన్ని ఈ సినిమాలో జోడించారు.

Telugu Ashwini Dutt, Bujji, Kalki, Keerthy Suresh, Nag Ashwin, Prabhas, Prabhas

ఇక దీపికా పదుకొనే కు( Deepika Padukone ) ఇది తొలి తెలుగు సినిమా అలాగే హాలీవుడ్ నుంచి మేకప్ ఆర్టిస్ట్ లు మాత్రమే కాదు టెక్నాలజీ నిపుణులను కూడా ఇంపోర్టు చేశాడు నాగ్ అశ్విన్.ఈ సినిమాకి అశ్విని దత్ ఇద్దరు కుమార్తెలు తను శాయ శక్తులు ఒడ్డి ప్రయత్నిస్తున్నారు. 700 కోట్ల బడ్జెట్ పెట్టి ఇప్పటి వరకు ఇండియా సినిమా చరిత్రలో ఎవ్వరు పెట్టలేనంత నిర్మాణ విలువలను జోడించారు.మొదటి రోజు రెండు వందల కోట్ల రూపాయల వసూలను కూడా ఆశిస్తున్నారు ఒకవేళ ఇది జరగకపోయినా ఎంతో కొంత ఖచ్చితంగా చరిత్రను తిరగరాసే ఓపెనింగ్స్ వస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube