పైసా ఖర్చు లేకుండా ఈ సింపుల్ చిట్కాలతో ముత్యాల్లాంటి దంతాలను మీ సొంతం చేసుకోండి!!

చిరునవ్వుకు అందం తెచ్చేది తెల్లటి మెరిసేటి దంతాలే అనడంలో ఎటువంటి సందేహం లేదు.అయితే చాలా మందికి దంతాలు తెల్లగా కాకుండా పసుపు రంగులో కనిపిస్తుంటాయి.

 Follow These Simple Tips For White And Shiny Teeth! White Teeth, Shiny Teeth, La-TeluguStop.com

ఇలాంటి వారు తమ దంతాలను అద్దంలో చూసుకున్న ప్రతిసారి తీవ్ర అసంతృప్తికి లోనవుతుంటారు.ఎలాగైనా దంతాలను తెల్లగా మెరిపించుకునేందుకు తపన పడుతుంటారు.

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.ఈ చిట్కాలతో ఖర్చు లేకుండా సులభంగా ముత్యాల్లాంటి దంతాలను మీ సొంతం చేసుకోవచ్చు.

ఒకప్పుడు మన పెద్దలు వేప పుల్లనే టూత్ బ్రష్ గా వాడేవారు.వేప పుల్లతో బ్రష్ చేసుకోవడం వల్ల దంతాలు ఆరోగ్యంగా దృఢంగా మారడమే కాకుండా తెల్లగా సైతం మారతాయి.

కాబట్టి వీలుంటే వారానికి కనీసం మూడు నాలుగు రోజులైనా వేప పుల్లతో బ్రష్ చేయడానికి ప్రయత్నించండి.

Telugu Tips, Latest, Shiny Teeth, Simple Tips, Teeth, White Teeth-Telugu Health

అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive oil ), వన్ టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్‌ వేసుకొని బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని ఉపయోగించి దంతాలను నాలుగైదు నిమిషాల పాటు బాగా తోముకోవాలి.ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రంగా దంతాలను నోటిని క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేసినా కూడా పసుపు దంతాలకు గుడ్ బై చెప్పవచ్చు.వైట్ అండ్ షైనీ టీత్ ను మీ సొంతం చేసుకోవచ్చు.

Telugu Tips, Latest, Shiny Teeth, Simple Tips, Teeth, White Teeth-Telugu Health

అరటిపండు తిన్నాక తొక్కను పారేయడం మనందరికీ ఉన్న అలవాటు.అయితే అరటిపండు తొక్క కూడా మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.ముఖ్యంగా అరటిపండు తొక్కతో దంతాలపై క్రమం తప్పకుండా సున్నితంగా రుద్దితే పసుపు రంగు పోతుంది.దంతాలు తెల్లగా మారతాయి.ఇక ఈ సింపుల్ చిట్కాలు పాటించడంతో పాటు స్వీట్స్, జంక్ ఫుడ్, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తీసుకోవడం తగ్గించండి.వీలైతే మానేయండి.

పాలు, పెరుగు, గుడ్లు, ఫైబర్ అధికంగా ఉండే పండ్లు కూరగాయలు, నట్స్ అండ్‌ సీడ్స్ ను డైట్ లో చేర్చుకోండి.ఇవి దంతాల ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube