కొన్నిసార్లు సినిమా చేస్తున్న సమయంలోనే అది విజయం సాధిస్తుందా లేక పరాజయం పొందుతుందా అనే విషయం నటించే నటీనటులకు ఖచ్చితంగా తెలుస్తుంది.ఎందుకంటే వారికి ఉన్న అనుభవం తో పాటు ఆ స్క్రిప్టు పై అలాగే ఉన్న నాలెడ్జ్ తో సినిమా జయాన్ని అంచనా వేస్తారు.
విజయం సాధిస్తే అందరికీ సంతోషమే కానీ వారు నటిస్తున్న సినిమా పరాజయం పాలవుతుంది అనే విషయం గ్రహించినా కూడా తీసుకున్న డబ్బులకు అలాగే ఇచ్చిన కమిట్మెంట్ కి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో కొంతమంది స్టార్ హీరోలు ఆ సినిమాను పూర్తి చేసే విడుదల చేయగా వారు ఊహించినట్టుగానే అది ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి.మరి ఆ సినిమాలు ఏంటి ఆ హీరోలు ఎవరు అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మహేష్ బాబు
ఈ సినిమా అయినా ఆడుతుందా లేదా అనే విషయాన్ని మహేష్ బాబు( Mahesh Babu ) చాలా చక్కగా అంచనా వేస్తారు.తాను తీసుకుని నిర్ణయాలు తప్పైనా సరే ఇచ్చిన కమిట్మెంట్ తో మాత్రమే ఆయన నిలబడి ఉంటారు.
అందుకే ఆగడు( Aagadu ) మరియు బ్రహ్మోత్సవం సినిమాలు సగం షూటింగ్ పూర్తి కాకముందే పరాజయం ఫాలో అవుతాయని తెలుసి కూడా డైరెక్టర్స్ కి ఇచ్చిన మాట కోసం సినిమాను పూర్తి చేశారు.తీరా ఈ రెండు సినిమాలు కూడా భయంకరమైన పరాజయాన్ని పొందాల్సి వచ్చాయి.
చిరంజీవి
డాడీ( Daddy ) లాంటి ఒక సెంటిమెంటల్ సినిమా తనకు సెట్ కాదు అని దర్శకుడికి ఎంత చెప్పినా వినకపోవడంతో ఆయనకు ఇచ్చిన మాట కోసం చిరంజీవి ఆ చిత్రాన్ని పూర్తి చేశారు తీరా సినిమా విడుదలయ్యాక ఆయన అంచనా వేసినట్టుగానే అది పరాజయం చవిచూసింది.
నాగ చైతన్య
నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా( Thank You ) షూటింగ్ 40% వరకు పూర్తికాగానే దానిలో విషయం లేదు అనే విషయం నాగచైతన్యకు అర్థమైపోయింది.కానీ సినిమా మధ్యలో ఆపితే కెరియర్ పై ప్రభావం పడుతుంది అని ఉద్దేశంతో దాన్ని పూర్తి చేశారు.అనుకున్నట్టు గానే సినిమా కూడా ఫెయిల్ అయింది.
మంచు విష్ణు
మంచు విష్ణు( Manchu Vishnu ) చాలా ఫ్లాప్ సినిమాలలో నటించాడు.ఆయన కెరీర్ లో డీ తప్ప మిగతావి అన్ని ఫ్లాప్ సినిమాలే.అయితే అన్ని అద్భుతమైన సినిమాలే అనే ఫీల్ లో మంచు విష్ణు ఉంటాడు.కానీ విష్ణు నటించిన సలీం సినిమా మాత్రం ఫ్లాప్ అవుతుంది అని సినిమా షూటింగ్ టైం లోనే ఆయనకు అర్థం అయ్యిందట.