ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు( AP CM Nara Chandrababu Naidu ) ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్, అల్లు అర్జున్ లకు ఆహ్వానాలు అందాయని సోషల్ మీడియలో వేదికగా వార్తలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.అయితే వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు.
వాస్తవానికి ఎన్టీఆర్, బన్నీలకు అసలు ఆహ్వానమే అందలేదు.ఒకవేళ ఆహ్వానం అంది ఉంటే మాత్రం ఎన్టీఆర్, బన్నీ ఈ వేడుకకు కచ్చితంగా హాజరై ఉండేవారని చెప్పవచ్చు.
జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గత కొన్నేళ్లుగా టీడీపీకి అనుకూలంగా ఎప్పుడూ వ్యవహరించలేదు.జూనియర్ ఎన్టీఆర్ పార్టీలకతీతంగా సినిమాలపై మాత్రమే ఫోకస్ పెడుతూ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు.అల్లు అర్జున్( Allu Arjun ) విషయానికి వస్తే వరుసగా పాన్ ఇండియా సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఈ హీరోకు ఫ్యాన్ బేస్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదనే సంగతి తెలిసిందే.
అయితే రాబోయే రోజుల్లో ఎన్టీఆర్, అల్లు అర్జున్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను కలిసి విష్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.ఎన్టీఆర్, బన్నీ సినిమాలకు ఏపీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కూటమి సపోర్ట్ కచ్చితంగా అవసరం అనే సంగతి తెలిసిందే.పుష్ప2, దేవర సినిమాలు రెండు నెలల గ్యాప్ లో థియేటర్లలో విడుదలవుతూ ఉండటం గమనార్హం.బన్నీ, ఎన్టీఆర్ సినిమాలకు టికెట్ రేట్లు పెరగాలంటే కూటమి నేతల అనుమతులు అవసరం అనే సంగతి తెలిసిందే.ఒకవేళ తమ సినిమాలకు ఇబ్బందులు ఎదురైతే ఈ హీరోలు ఏ విధంగా వ్యవహరిస్తారనే చర్చ సైతం జరుగుతోంది.
బన్నీ, తారక్ ఇతర భాషల్లో సైతం ఒక్కో మెట్టు ఎదుగుతూ సత్తా చాటాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఎన్టీఆర్, బన్నీలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.