వైరల్ వీడియో: 5 గంటలుగా నీటిలోనే వ్యక్తి.. చనిపోయాడని పోలీసులకు ఫోన్ చేస్తే.. చివరకు..

ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక వింత వింత వీడియోలు వైరల్ అవుతుండడం చూస్తూనే ఉంటాం.తాజాగా హనుమకొండ లోని( Hanamkonda ) పోలీసులకు ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.

 Police Shocked After Trying To Take Out A Man Lying In Water At Hanamkonda Detai-TeluguStop.com

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.తాజాగా హనుమకొండ పట్టణంలోని రెండవ డివిజన్ రెడ్డిపురం కోవెలకుంట్ల ప్రాంతంలో ఓ వ్యక్తి మంగళవారం ఉదయం ఏడు గంటల ప్రాంతం నుండి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతం వరకు నీటిలోనే కదలకుండా అలాగే ఉండిపోయాడు.

దీంతో అక్కడి స్థానికులు కొందరు అతనిని గమనించి ఎవరో ఆత్మహత్యకు పాల్పడ్డారన్న ఉద్దేశంతో ఏకంగా ఆ విషయాన్ని పోలీసులకు,( Police ) అలాగే 108 సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించారు.

ఈ విషయం సంబంధించి వెంటనే అలర్ట్ అయిన పోలీసులు, 108 సిబ్బంది ఆ వ్యక్తి మృతి చెందాడని భావిస్తున్నా ప్రాంతానికి చేరుకున్నారు.అయితే ఆ వ్యక్తిని నీటిలో నుండి బయటికి తీద్దామని పోలీసులు ప్రయత్నించగా.అతడు వెంటనే కదలడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.

దాంతో వెంటనే పోలీసులు అతడిని ఎందుకు ఇంతసేపు నీటిలో ఉన్నామని ప్రశ్నించగా అతడు తాను నెల్లూరు జిల్లా కావలికి( Kavali ) చెందిన వ్యక్తిగా తెలుపుతూ., 10 రోజుల నుంచి గ్రానైట్ క్వారీలో ప్రతిరోజు 12 గంటలసేపు పనిచేయడంతో.

ఎండ వేడిమి తట్టుకోలేక ఇలా నీటిలో( Water ) సేద తీరడానికి వచ్చినట్లు తెలిపారు.

దీంతో సదరు వ్యక్తి చెప్పిన మాటలు విని పోలీసులతో పాటు అక్కడ ఉన్న వారంతా షాక్ గురయ్యారు.ఈ నేపథ్యంలో సదరు వ్యక్తిని పోలీస్ స్టేషన్ కి పోలీసులు తీసుకువెళ్లారు.ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వీడియోకి సోషల్ మీడియా నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇందులో కొందరు నెటిజెన్స్ అతను ఫుల్లుగా బిర్యానీ తిని, మద్యం తాగి ఇలా చేసి ఉండొచ్చు కాబోలు అని కామెంట్ చేస్తుండగా.మరికొందరైత, ఏం ట్విస్ట్ ఇచ్చావు గురు అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని ఒకసారి వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube