ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇంకా చల్లారలేదని చెప్పాలి.ఎన్నికలలో కూడా తమది విజయమని వైసీపీ అభిమానులు, కూటమి అభిమానులు నేతలు భావించారు.
కానీ ఎన్నికల ఫలితాలు ఊహించని విధంగా రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికి పలు ప్రాంతాలలో అల్లర్లు గొడవలు చోటు చేసుకుంటున్నాయి.ఇక ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో కూడా రెండు పార్టీ నేతలు నువ్వా నేనా అనుకునే విధంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ క్రమంలోనే జబర్దస్త్ ( Jabardasth ) కమెడియన్ గా గుర్తింపు పొందిన కిరాక్ ఆర్పీ ( Kirak RP ) సైతం కూటమికి మద్దతు తెలుపుతూ వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక ఎన్నికల ఫలితాలలో కూటమి అధికారంలోకి రావడంతో ఈయన పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ కూటమి విజయం పట్ల సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా వైసీపీ నేతలపై చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ఇకపోతే ఈ ఇంటర్వ్యూలలో భాగంగా ఈ పార్టీకి మద్దతు తెలిపిన నటుడు అల్లు అర్జున్ ( Allu Arjun ) గురించి కూడా ఈయన విమర్శలు చేయడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవి చంద్ర కిషోర్ ఓడిపోయాడని.కానీ రాష్ట్రం కోసం పదేళ్లుగా కష్టపడుతున్న మావయ్య పవన్ కళ్యాణ్ కు ( Pawan Kalyan ) వ్యతిరేకంగా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్ధికి సపోర్ట్ చేయడం నచ్చలేదని, దీని మెగా ఫ్యామిలీ స్పందించకపోయిన నేను స్పందిస్తానని తెలిపారు.అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలపకపోవడం ముమ్మాటికి తప్పని ఈయన చెప్పడమే కాకుండా బన్నీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
దీంతో మండిపడిన బన్నీ ఫ్యాన్స్ ఆయన చేపల పులుసు రెస్టారెంట్ పై దాడులు చేశారని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఈ దాడులు పై ఇప్పటివరకు ఆర్పీ ఎక్కడ స్పందించకపోవడంతో అసలు నిజంగానే ఆయన రెస్టారెంట్ పై దాడి జరిగిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.