యాదాద్రి భువనగిరి జిల్లా:భూ వివాదంలో తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన బాధితులను ఎస్ఐ చితకబాదిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… దత్తప్పగూడెం గ్రామానికి చెందిన ఎలుగు సతీష్,ఏలుగు మచ్చగిరి అనే అన్నదమ్ములకు గ్రామంలో సర్వేనెంబర్ 52, 53,54 లో 34 గంటల భూమి కలదు.
వీరికి,పక్క పొలం వారికి గత కొద్దిరోజులుగా తరచూ భూ వివాదం నడుస్తుంది.ఈ క్రమంలో గత ఐదు రోజుల క్రితం పొలం పక్కన ఉన్న చెట్లను తొలగిస్తుండగా మళ్ళీ గొడవ జరిగడంతో బాధితులు 100 కాల్ చేశారు.
దీనితో ఇద్దరు కానిస్టేబుళ్లు పొలం దగ్గరకు వెళ్ళి పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడిన అనంతరం భూమిని దున్నుకోవాలని చెప్పి వెళ్లారు.గురువారం తిరిగి అదే గెట్టు దగ్గర పంచాయతీ జరగడంతో ఇద్దరు అన్నదమ్ములు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అనంతరం మోత్కూరు పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు.తరచూ గుడవలు పడుతున్నారంటూ ఎస్ఐ ఏమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఫిర్యాదుదారులపై కోపంతో ఊగిపోతూ ఎస్సై రూమ్ నుండి వారిని గల్ల పట్టుకొని హాల్లోకి లాక్కెళ్లి ఇష్టానుసారంగా కొట్టి, బయటకు తోశారని బాధితులు ఆరోపించారు.
ఇదే విషయమై ఎస్ఐ ఏమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డిని వివరణ కోరగా వారు చేసే ఆరోపణల్లో వాస్తవం లేదని,నేను బూతులు తిట్టలేదని,ఎవరిపై చేయి చేసుకోలేదని,ఇదంతా కావాలని చేస్తున్నారని అన్నారు.







