తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు అల్లు అర్జున్(Allu Arjun) ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో తనదైన రీతిలో గుర్తింపుని సంపాదించుకున్నాడు.ఇక ప్రస్తుతం పుష్ప 2 (pushpa2)సినిమాతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతుంది.ఇక ఇదిలా ఉంటే సుకుమార్ (Sukumar)లాంటి దర్శకుడు ఈ సినిమాని చాలా ప్రస్టేజీయస్ గా తీసుకొని తెరకెక్కిస్తుండడం విశేషం.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పుష్ప 2 సినిమా కోసం బాలీవుడ్ అభిమానులందరూ ఎదురు చేస్తున్నారు.మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి.అయితే రెండు సాంగ్స్ కూడా మంచి గుర్తింపు పొందడమే కాకుండా సినిమా మీద అంచనాలను కూడా పెంచేస్తున్నాయి.కాబట్టి ఈ సినిమా విషయంలో ప్రతి ఒక్కరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తాను మరోసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని సుకుమార్, స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాలని అల్లు అర్జున్ (allu arjun)ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఈ సినిమా మొత్తం ఎలా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక రెండు సీన్లకు మాత్రం ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ లో కూర్చొని ఆ సీన్ ని ఈగర్ గా ఎంజాయ్ చేస్తారని సినిమా యూనిట్ అయితే తెలియజేస్తుంది… ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తెలుగు సినిమా స్థాయి ని పెంచాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి ఈ సినిమాతో తను ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది.








