కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Canadian Prime Minister Justin Trudeau ) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.తమ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని తీవ్రంగా పరిగణిస్తామన్నారు.
కెనడాకు చెందిన కొందరు ఎంపీలు ఇతర దేశాలచే ప్రభావితమయ్యారంటూ పార్లమెంటరీ కమిటీ నివేదిక పేర్కొన్న నేపథ్యంలో ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారు.‘‘ నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ కమిటీ ఆఫ్ పార్లమెంటేరియన్స్ (NSCIOP) ’’ నివేదిక ప్రకారం .కొంతమంది ఎంపీలు విదేశీ మిషన్‌లతో ప్రభావితమయ్యారు.విదేశీ దౌత్యవేత్తలతో ప్రత్యేకమైన సమాచారాన్ని పంచుకోవడంతో పాటు నిధులు కూడా పొందారని నివేదిక పేర్కొంది.
తద్వారా కెనడాలోని వారి సహోద్యోగులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని ఆరోపించింది.మేలో ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించబడిన నివేదిక , ఈ వారం సవరణలతో సమర్పించబబడింది.
దేశీయంగా, విదేశాలలో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ( Chinese Communist Party ) చట్టబద్ధత, స్థిరత్వాన్ని రక్షించడానికి , మెరుగుపరచడానికి .చైనా వ్యూహాత్మక ప్రయోజనాలు ముందుకు తీసుకెళ్లడానికి కెనడా ప్రజాస్వామ్య ప్రక్రియలు, సంస్థలను ప్రభావితం చేయడానికి ఒక సమగ్ర విధానాన్ని అమలు చేస్తోందని నివేదిక పేర్కొంది.అంతేకాదు .దేశానికి భారత్ రెండవ ముఖ్యమైన విదేశీ ముప్పుగా ఆరోపించింది.కెనడాలో( Canada ) భారత విదేశీ జోక్య యత్నాలు నెమ్మదిగా పెరిగాయని.ఖలిస్తాన్ అనుకూల అంశాలను ఎదుర్కోవడానికి మించి అవి విస్తరించాయని తెలిపింది.
కెనడియన్ రాజకీయ నాయకులు, నేషనల్ మీడియా, ఇండో కెనడియన్ ఎథ్నో కల్చరల్ కమ్యూనిటీలను లక్ష్యంగా చేసుకోవడంతో సహా కెనడియన్ ప్రజాస్వామ్య ప్రక్రియలు, సంస్థలలో జోక్యం చేసుకోవడం వరకు వెళ్లాయని నివేదిక పేర్కొంది.పాకిస్తాన్ సైతం కొన్ని కెనడియన్ ప్రజాస్వామ్య సంస్థలు, ప్రక్రియలను లక్ష్యం చేసుకుందని ఆరోపించింది.మంగళవారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఈ విషయంపై ట్రూడో మాట్లాడుతూ .తీవ్ర వ్యాఖ్యలు చేశారు.తమ ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందన్నారు.ఇంటెలిజెన్స్ , భద్రతా విషయాలపై పర్యవేక్షణ నిమిత్తం NSCIOP 2018లో స్థాపించబడింది.ఇందులో హౌస్ , సెనేట్‌లకు చెందిన ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.లిబరల్ పార్టీ ఎంపీ డేవిడ్ మెక్‌గింటి ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు.