ఒక వ్యక్తి కెరీర్ పరంగా సక్సెస్ సాధించాడంటే ఆ సక్సెస్ కోసం కచ్చితంగా ఎన్నో కష్టాలను అనుభవించే ఉంటాడు.అలా ఎన్నో కష్టాలను అనుభవించిన వ్యక్తులలో థైరో కేర్ టెక్నాలజీస్ ఫౌండర్ వేలుమణి ( Velumani )ఒకరు.1959 సంవత్సరంలో వేలుమణి కోయంబత్తూరు సమీపంలోని ఒక కుగ్రామంలో జన్మించాడు.వేలుమణి తండ్రి వ్యవసాయం చేసి జీవనం సాగించేవారు.
పిల్లల కనీస అవసరాలను తీర్చే విషయంలో సైతం వేలుమణి తండ్రికి ఇబ్బందులు ఎదురయ్యాయి.
బాల్యం నుంచి వేలుమణి దృఢంగా ఉండటంతో పాటు ఎంతో కష్టపడి రామకృష్ణ మిషన్ యూనివర్సిటీ ( Ramakrishna Mission University )నుంచి డిగ్రీ పూర్తి చేశారు.
థైరాయిడ్ బయో కెమిస్ట్రీలో( Thyroid Biochemistry ) డిగ్రీ పొందిన ఆయన థైరో కేర్ ప్రారంభించడానికి ముందు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్( Baba Atomic Research Centre ) ముంబైలో 15 సంవత్సరాల పాటు పని చేశారు.న్యూక్లియర్ హెల్త్ కేర్ లిమిటెడ్ ఎండీగా కూడా ఆయన పని చేయడం గమనార్హం.

ఒకవైపు జాబ్ చేస్తూనే ఆంకాలజీ, రేడియాలజీలలో వినియోగించే టెక్నాలజీ గురించి ఆయన అవగాహన తెచ్చుకున్నారు.1996 సంవత్సరంలో సొంతంగా థైరాయిడ్ టెస్టింగ్ లాబొరేటరీని ఏర్పాటు చేసిన ఆయన థైరోకేర్ ను ఏర్పాటు చేయాలని అనుకున్నారు.డయాగ్నస్టిల్ లాబొరేటరీలో ఫ్రాంఛైజ్ మోడల్ ను మొదలుపెట్టగా ఆయనకు ఏకంగా 1400 కోట్ల రూపాయల నష్టాలు వచ్చాయి.

ప్రస్తుతం వేలుమణి స్థాపించిన థైరో కేర్ టెక్నాలజీస్ విలువ 3300 కోట్ల రూపాయలుగా ఉంది.బాల్యం నుంచి ఎన్నో కష్టాలను చూసిన వేలుమణి లైఫ్ లో స్థిరపడాలనే ఆలోచనతో వేల కోట్ల సంపదను సృష్టించారు.ఇతని సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
వేలుమణి కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.







