ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో( Tirumala ) భక్తుల రద్దీ భారీగా పెరిగింది.వేసవి సెలవులతో పాటు వారాంతం కూడా కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
భక్తులు( Devotees ) పెద్ద సంఖ్యలో వస్తుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని( Vaikuntham Queue Complex ) అన్నీ కంపార్ట్ మెంట్ లు నిండిపోయాయి.శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు.
దీంతో స్వామివారి సర్వ దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతుంది.కాగా జూన్ 30 వరకు శుక్ర, శని మరియు ఆది వారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.