మేడారంలోని సమ్మక్క – సారమ్మ( Sammakka Saralamma )ల దర్శనాలు రెండు రోజులపాటు నిలిచిపోనున్నాయి.ఈ మేరకు ఈ నెల 29, 30 న అమ్మవార్ల దర్శనం నిలిపివేయనున్నారు.
గద్దెల ప్రాంగణాన్ని రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు మేడారం పూజారులు ప్రకటించారు.స్థలం కేటాయింపుపై ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖ అధికారుల తీరుపై నిరసనగా దర్శనాన్ని నిలిపివేయనున్నట్లు పూజారులు వెల్లడించారు.
కాగా 1993 లో మేడారం జాతర భవిష్యత్ అవసరాల కోసం వరంగల్ (Warangal)లో వెయ్యి గజాల ప్రభుత్వ స్థలం కేటాయింపు జరిగింది.కానీ అదే స్థలంలో దేవాదాయ శాఖ ధార్మక భవనాన్ని నిర్మించింది.
ఈ క్రమంలో స్థలంతో పాటు ధార్మిక భవనాన్ని అప్పగించాలని మేడారం పూజారులు డిమాండ్ చేస్తున్నారు.