ఈమె ఆస్ట్రేలియాలోనే అత్యంత ధనికురాలు.. తన పెయింటింగ్ ఎవరూ మెచ్చడం లేదని..?

ఆస్ట్రేలియాలో అత్యంత సంపన్న మహిళగా పేరు తెచ్చుకున్న గినా రిన్‌హార్ట్ ( Gina Rinehart )ఇటీవల ఒక షాకింగ్ రిక్వెస్ట్ చేసింది.ఆస్ట్రేలియాలోని నేషనల్ గ్యాలరీలో ఉంచిన తన పోర్ట్రెయిట్‌ను ఎగ్జిబిషన్ నుంచి తొలగించాలని కోరింది.

 She Is The Richest Person In Australia.. No One Appreciates Her Painting , Gina-TeluguStop.com

తన చిత్రానికి పెద్దగా స్పందన లభించడం లేదని ఆమె ఫీల్ అయిపోతూ ఈ నిర్ణయం తీసుకుంది.ఈ చిత్రం “ఆస్ట్రేలియా ఇన్ కలర్( Australia in Colour )” అనే ప్రదర్శనలో భాగం, ప్రస్తుతం ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రాలో 21 పోర్ట్రెయిట్స్‌ను ప్రదర్శిస్తున్నారు.70 ఏళ్ల రిన్‌హార్ట్, 30.6 బిలియన్ డాలర్ల విలువైన ఖనిజ అన్వేషణ సంస్థ హ్యాంకాక్ ప్రాస్పెక్టింగ్‌కు నాయకత్వం వహిస్తుంది. కాన్‌బెర్రా గ్యాలరీలో ఓ ప్రముఖ కళాకారుడి ఆర్ట్ ప్రదర్శనలో భాగంగా పోర్ట్రెయిట్‌ను ఎగ్జిబిట్ చేశారు.

Telugu Australia, Canberra, Gina Rinehart, Portrait-Telugu NRI

ఈ ఎగ్జిబిషన్‌లో చారిత్రక, సమకాలీన వ్యక్తుల చిత్రాలు కూడా ఉన్నాయి.వాటిలో కొన్ని దివంగత రాణి ఎలిజబెత్ II, మ్యుజీషియన్ జిమి హెండ్రిక్స్, లోకల్ ఆస్ట్రేలియా లీడర్ విన్సెంట్ లింగియారి, మాజీ ఆస్ట్రేలియా పీఎం స్కాట్ మోరిసన్ రిన్‌హార్ట్ చిత్రాన్ని చిత్రించిన కళాకారుడు విన్సెంట్ నమత్జిరా పోర్ట్రెయిట్స్‌ ఉన్నాయి.ఈ చిత్రంలో, రిన్‌హార్ట్ ఎర్రటి రంగు చర్మం, విశాలమైన నుదిటి, గడ్డం కింద కనిపించే ముడతలతో కనిపిస్తుంది.

Telugu Australia, Canberra, Gina Rinehart, Portrait-Telugu NRI

రిన్‌హార్ట్‌ స్నేహితులు, ఆమె సంస్థ స్పాన్సర్ చేసిన క్రీడాకారులు ఈ చిత్రంపై తమ అసంతృప్తిని గ్యాలరీకి తెలియజేశారు, కొందరు దానిని తొలగించాలని డిమాండ్ చేశారు.ఈ ఫిర్యాదుల ఉన్నప్పటికీ, NGA జులై 21 వరకు చిత్రాన్ని ప్రదర్శనలో ఉంచాలని నిర్ణయించుకుంది. ప్రజలకు కళల గురించి తెలియజేయడానికి ఈ ఆర్ట్ గ్యాలరీ వివిధ చిత్రాలను ఎప్పుడూ ప్రదర్శిస్తుంది.గినా రిన్‌హార్ట్ చిత్రంపై వచ్చిన విమర్శలకు స్పందించిన కళాకారుడు విన్సెంట్ నమత్జిరా తన చిత్రాలు ప్రపంచంపై తన దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయని, తనను, తన దేశాన్ని ప్రభావితం చేసిన ప్రముఖ వ్యక్తులపై దృష్టి పెడతాయని చెప్పారు.

గినా ఖనిజ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తి అయిన దివంగత లాంగ్ హ్యాంకాక్‌కు ఏకైక కుమార్తె.మూడు దశాబ్దాలకు పైగా ఆమె తన తండ్రి వ్యాపారమైన హ్యాంకాక్ ప్రాస్పెక్టింగ్‌ను స్వాధీనం చేసుకుని, అప్పటి నుంచి దానిని చాలా విజయవంతమైన సంస్థగా అభివృద్ధి చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube