తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కిన ఎన్టీఆర్.. మహిళపై కేసు నమోదు.. వివాదంలో ట్విస్టులివే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తారక్ వివాదాలకు సైతం దూరంగా ఉంటారు.

 Shocking Twists In Junior Ntr Flot Case Details Here Goes Viral , Junior Ntr-TeluguStop.com

అయితే తన ఇంటి స్థలం విషయంలో వివాదం నెలకొనడంతో తారక్ తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని సమాచారం అందుతోంది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఉన్న 681 చదరపు గజాల స్థలం విషయంలో ఈ వివాదం తలెత్తిందని భోగట్టా.

Telugu Flot, Geetha, Jubilee Hills, Ntr, Telangana, Tollywood-Movie

2003 సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ సుంకు గీత( Geetha ) అనే మహిళ నుంచి ఈ స్థలాన్ని కొనుగోలు చేసి ఆ సమయంలో చట్టపరంగా ఇంటి నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు పొంది ఇంటి నిర్మాణం చేపట్టారు.అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఎవరైతే స్థలాన్ని అమ్మారో ఆ వ్యక్తులు 1996 సంవత్సరంలోనే ఆ స్థలాన్ని తమ వద్ద తనఖా పెట్టి రుణాలు పొందారని ప్రముఖ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండ్‌సఇండ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ డీఆర్‌టీను ఆశ్రయించడం జరిగింది.

Telugu Flot, Geetha, Jubilee Hills, Ntr, Telangana, Tollywood-Movie

డెట్‌ రకవరీ ట్రైబ్యునల్‌ బ్యాంకులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ డీఆర్టీలో పిటిషన్ దాఖలు చేయగా ఆ స్థలంపై బ్యాంకులకే హక్కులు ఉంటాయంటూ డీఆర్టీ నుంచి తీర్పు వెలువడింది.ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదు మేరకు భూమిని విక్రయించిన గీతపై కేసు నమోదు చేయడం జరిగింది.డీఆర్టీ తీర్పు విషయంలో తారక్ తెలంగాణ హైకోర్టు( Telangana High Court )ను ఆశ్రయించారు.వేర్వేరు కారణాల వల్ల ఈ కేసు విచారణ జూన్ నెల 6వ తేదీకి వాయిదా పడింది.

కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర వివారాలను జూన్ 3వ తేదీలోగా అందజేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.గీత అనే మహిళ చేసిన మోసం జూనియర్ ఎన్టీఅర్ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.

తెలంగాణ హైకోర్టులో తారక్ కు అనుకూలంగా తీర్పు వెలువడుతుందో లేక వ్యతిరేకంగా తీర్పు వెలువడుతుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube