తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు రామ్ పొతినేని( Ram Pothineni )…ప్రస్తుతం ఈయన పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కు కూడా రెడీ అవుతుంది.
కాబట్టి ఈ సినిమాతో సక్సెస్ సాధించి పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధించాలనే పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత ఆయన వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.అయితే డబుల్ ఇస్మార్ట్( Double iSmart ) సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక వీళ్ల కాంబినేషన్ లో ఇంతకుముందే ఒక సినిమా రావాల్సి ఉంది.
అయినప్పటికీ అది అనుకోని కారణాలవల్ల ఆగిపోయింది.కానీ ఇప్పుడు పక్కాగా మరొక సినిమా వచ్చే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి కసరత్తులు చేస్తున్నాడు.మరి ఆ సినిమా తర్వాత రామ్ తో వచ్చే సినిమా ఉంటుందా లేదా రామ్ తో సినిమా చేసిన తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఇక అలాగే రామ్ తో సినిమా చేయడానికి మరికొంతమంది యంగ్ డైరెక్టర్స్ కూడా పోటీపడుతున్నారు.ఇక అందులో అనిల్ రావిపూడి( Anil Ravipudi ) ఒకరు.ఇప్పుడు ఈయన వెంకటేష్ ( Venkatesh )తో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా అయిపోయిన వెంటనే రామ్ తో ఒక సినిమా చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
చూడాలి మరి ఈ సినిమాతో ఆయన సూపర్ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది.ప్రస్తుతం రామ్ ఫోకస్ మొత్తం డబుల్ ఇస్మార్ట్ సినిమా మీదనే ఉంది…
.







