ఎన్టీఆర్( NTR) చాలా ఆ పిసినారి డబ్బు విషయంలో ఎంతో కట్టుదిట్టంగా ఉంటారు పైగా షూటింగ్ కి వచ్చినప్పుడు అక్కడ సామాన్లు కూడా తీసుకెళ్లి పోతారు అంటూ ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడుతూ ఉంటారు.కానీ ఆయనకు దగ్గర వారైనా కొంత మందికి మాత్రమే ఈ విషయాలు తెలుసు.
ఆయనకు కెరియర్ ఇచ్చిన తొలినాళ్లలో వారికి ఎవరికీ ఏమైనా అయితే ఎన్టీఆర్ చాలా సార్లు సహాయం చేశారట ఆయనకు తెలియకుండా ఎవరైనా చెప్పకుండా దాచిన సరే ఆ తర్వాత తెలుసుకొని వారితో గొడవ పెట్టుకునే వారట.మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు చెప్పకుండా దాచాల్సిన అవసరం ఏముంది అంటూ వారితో మాట్లాడకుండా ఉండేవారట.

ఉదాహరణకు గౌతమీ పిక్చర్స్ అధినేత నర్రా రాంబ్రహ్మం( Narra Rambraham ) గారు ఎన్టీఆర్ తో చాలా సినిమాలు చేశారు.జీవితాంతం బ్రహ్మచారి గానే ఉన్న ఆయన క్యాన్సర్ సోకగానే తన ఇంటిని అమ్ముకొని ట్రీట్మెంట్ చేయించుకున్నారట.అప్పటికి చాలా మటుకు ఆస్తులు కరిగిపోయాయి దాంతో ఆ విషయం లేటుగా ఎన్టీఆర్ కి తెలియడంతో ఇంటిని అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది అంటూ నర్రవారితో గొడవకు దిగారట.చాలా రోజులపాటు ఆయనతో మాట్లాడలేదట.
మేముండగా మీకంత కష్టం ఎందుకు వచ్చింది నాకు జీవితం ఇచ్చారు.మీ కోసం నేను ఈ మాత్రం చేయలేనా అని అంటూ ఉండేవారట.
ఆ తర్వాత నిమ్మకూరు( Nimmakuru) నుంచి తనకు తెలిసిన ఒక డాక్టర్ ను రప్పించి మరీ ఆయనకు ట్రీట్మెంట్ ఇప్పించారట.

ఇక ఎన్టీఆర్ కె.వి రెడ్డికి ఎంతగానో ఆప్తుడు.కె.వి రెడ్డి కుమారుడు అమెరికా వెళ్లాలి అనుకున్నప్పుడు ఎన్టీఆర్ దానికి సంబంధించిన అన్ని పనులు చేసి ఫ్లైట్ కూడా ఎక్కించారట.ఇక విజయ సంస్థ వారు కె.వి యూనిట్ ని తీసివేసి కంపెనీ నుంచి ఇచ్చిన కారును కూడా వెనక్కి తీసుకుంటే ఎన్టీఆర్ తన సొంత కారుని ఆయనకు ఇచ్చారట.ఇలా కెరియర్ లో కాస్త సెటిల్ అయిన తర్వాత తనకు మొదటి రోజుల్లో సహాయం చేసిన వారందరికీ కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు తాను ఉన్నాను అంటూ ఎన్టీఆర్ పూనుకొని అన్ని పనులు చేసేవారట.