ప్రస్తుత ఆధునిక సమాజంలో ప్రజలకు కాస్త ఆరోగ్యం పై జాగ్రత్తలు మొదలయ్యాయి.ఇందుకోసం చాలామంది ఫిట్ గా ఉండాలంటూ వ్యాయామం తోపాటు అనేక రకాల కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు.
ఇందుకోసం చాలామంది జిమ్ సెంటర్లలో( Gym ) చెమటలు చిందించడం పరిపాటుగా మారిపోయింది.అయితే ఇలా జిమ్ సెంటర్లకు వెళ్లడం కాస్త ఖర్చుతో కూడుకున్న పని.
ముఖ్యంగా ట్రెడ్ మిల్ ( Treadmill ) కొందాం అనుకుంటే చాలా ఎక్కువ ఖర్చవుతుంది.ఇకపోతే తాజాగా వైరల్ అవుతున్న వీడియోని చూస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ట్రేడ్ మిల్ ను తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకోవచ్చు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.వైరల్ గా మారిన వీడియోలో ఒక వ్యక్తి ట్రెడ్ మిల్ మీదుగా నడుస్తున్నట్లు బురదపై( Mud ) నడుస్తూ ఓ వ్యక్తి కనిపించాడు.
అలా నేలపై ఎంత బురద ఉంటే అంత స్పీడ్ గా దానిని ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు సదరు వ్యక్తి.ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ నిజంగా ఇన్ని రోజులు అనవసరంగా ఇందుకోసం డబ్బులు ఖర్చు చేసేవాడు తెగ బాధ పడిపోతున్నారు.మరికొందరైతే మీ ఆనందాన్ని మీరే సృష్టించుకోవాలి అంటూ వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియోలో ఓ వ్యక్తి బురదలో నడుస్తుండగా ఓ చిన్న కుర్రాడు పైపుతో నీరు కొట్టడంతో నడుస్తున్న వ్యక్తి కింద జారి పడిపోవడం చివరిగా మనం చూడవచ్చు.
మరికొందరు ఈ వీడియో పై అతను తన సొంత ట్రెడ్ మిల్ ను ఏర్పాటు చేసుకున్నారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు
.