పిల్లలు మరియు ఆడవారిలో ఎక్కువగా కనిపించే సమస్యల్లో రక్తహీనత ఒకటి.రక్తహీనతకు ప్రధాన కారణం ఐరన్ లోపం.
శరీరానికి సరిపడా ఐరన్ అందనప్పుడు రక్తహీనత బారిన పడుతుంటారు.దీంతో తరచూ నీరసం, అలసట, కళ్లు తిరగడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.
కాబట్టి రక్తహీనత( Anemia )ను తరిమికొట్టడం ఎంతో అవసరం.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే ఐరన్ రిచ్ లడ్డు ఎంతో బాగా సహాయపడుతుంది.
రోజుకు ఒకటి చొప్పున ఈ లడ్డూను తీసుకుంటే రక్తహీనత పరార్ అవ్వడమే కాకుండా మరెన్నో ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఐరన్ రిచ్ లడ్డూను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు బాదం పప్పు( Almonds) వేసుకుని దోరగా వేయించుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు వేరుశనగలు, ఒక కప్పు జీడిపప్పు, అర కప్పు అవిసె గింజలు, అర కప్పు నువ్వులు, అరకప్పు చియా సీడ్స్ విడివిడిగా వేయించుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో జీడిపప్పు, వేరు శనగలు, బాదంపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, నాలుగు లవంగాలు, పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత అందులో అవిసె గింజలు, చియా సీడ్స్ మరియు అరకప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకోవాలి.ఇప్పుడు అదే మిక్సీ జార్ లో రెండున్నర కప్పులు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఈ ఖర్జూరం మిశ్రమాన్ని ముందుగా గ్రైండ్ చేసుకున్న నట్స్ మిశ్రమంలో వేసి చేతితో బాగా కలుపుకోవాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల మాదిరిగా చుట్టుకుని ఫ్రిడ్జ్ స్టోర్ చేసుకోవాలి.ఈ లడ్డు రుచికరంగా ఉండడమే కాకుండా పోషకాలతో లోడ్ చేయబడుతుంది.ఐరన్ తో పాటు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఎన్నో రకాల మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు ఈ లడ్డూలో ఉంటాయి.రోజుకు ఒకటి చొప్పున ఈ లడ్డూను తీసుకుంటే ఎలాంటి రక్తహీనత అయినా సరే పరార్ అవుతుంది.
అలాగే ఎముకలు బలోపేతం అవుతాయి.మోకాళ్ళ నొప్పులు వేధించకుండా ఉంటాయి.
అలాగే ఈ లడ్డూను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
హెయిర్ ఫాల్ సైతం కంట్రోల్ అవుతుంది.