ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిగ్గా ఎన్నికల సమయంలో పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి.ఏపీలో మారుతున్న పరిణామాల వల్ల వైసీపీకి మేలు జరుగుతుండగా అదే సమయంలో టీడీపీ నష్టపోతుండటం గమనార్హం.
ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన కామెంట్లపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తీరు మారదా అంటూ నెటిజన్లు కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు చంద్రబాబు( Chandrababu naidu ) ప్రకటించిన మేనిఫెస్టో అమలు సాధ్యం కాని మేనిఫెస్టో అని రాజకీయ విశ్లేషకులు సైతం పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చేస్తున్నారు.హైకోర్టు వైసీపీ పథకాల నిధుల మంజూరుకు అనుమతులు ఇవ్వడంతో ఆ పార్టీ నెత్తిన పాలు పోసినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఈరోజు రాత్రిలోగా లబ్ధిదారుల ఖాతాలలో నిధులు జమయ్యేలా జగన్ సర్కార్ అడుగులు వేయడం గమనార్హం.
వైసీపీ నేతలు సరైన సమయంలో కోర్టును ఆశ్రయించి మంచి పని చేశారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.ఏపీలో జగన్ వేవ్ మొదలైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నా ఒక్కొక్కటిగా వాటిని అధిగమిస్తూ మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చేలా చేయడంలో జగన్ సక్సెస్ అవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఎన్నికల్లో ఇప్పటికీ పోటాపోటీ పరిస్థితులు ఉన్నా పేదలు, నిరుపేదలు జగన్( CM ys jagan ) పక్షాన నిలబడటం హాట్ టాపిక్ అవుతోంది.చంద్రబాబు పాలన చూశామని జగన్ పాలన చూశామని ఎవరి పాలన బాగుందనే ప్రశ్నకు మాత్రం ఎలాంటి సందేహం లేకుండా జగన్ పాలన అనే చెబుతామని ఓటర్లు చెబుతున్నారు.
సంక్షేమంతో రాష్ట్రంలో వైసీపీ మరోమారు సత్తా చాటడం ఖాయమని తేలిపోయింది.సీఎం జగన్ కు ఈ ఎన్నికలు కీలకం కాగా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే మరో 30 ఏళ్లు తానే సీఎం అని ఆయన భావిస్తున్నారు.
జగన్ నమ్మకం నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది.