తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్( Allu Arjun )… అయితే ఈయన పుష్ప సినిమాతో మొదటి సారి పాన్ ఇండియా లోకి అడుగుపెట్టాడు.కాబట్టి అక్కడ తనను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేశాడు.
ఇక అందులో భాగంగానే ఆయన ఐకాన్ స్టార్ అనే బిరుదును కూడా సంపాదించుకున్నాడు.ఇక ఈ సినిమా పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ అయింది.
ఇక అప్పటినుంచి ఆయనకి ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ అయితే దక్కింది.ఇక ఇది ఇలా వుంటే ఇప్పుడు ఆయన పుష్ప 2 సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్న విషయం మనకు తెలిసిందే… అయితే ఆర్య సినిమా( Arya ) 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు రీసెంట్ గా ఒక ఈవెంట్ ని కూడా కండక్ట్ చేశాడు.ఇక ఈ ఈవెంట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరు సినిమాకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకున్నారు.ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కి సుకుమార్ కి మధ్య క్లైమాక్స్ సీన్ విషయంలో కొంతవరకు క్లాషెస్ అయితే వచ్చాయంట్టు అప్పట్లో సుకుమార్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.
ఇక సుకుమార్( Sukumar ) చెప్పిన క్లైమాక్స్ అల్లు అర్జున్ కు సరిగ్గా కన్వే అవ్వకపోవడం వల్లే ఆ డిస్టబెన్స్ అనేది జరిగిందంటూ సుకుమార్ తెలియజేశాడు.ఇక మొత్తానికైతే సుకుమార్ అల్లు అర్జున్ ను కన్వీనిస్ చేసి ఈ సినిమాను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయడం అనేది ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయిందంటూ ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం విశేషం…ఇక ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో పుష్ప 2 సినిమా రాబోతుండటం నిజంగా ఒక రకంగా మంచి విషయం అనే చెప్పాలి…
.