లో ఓల్టేజ్ కు చెక్.. త్రీ ఫేజ్ కరెంట్ సప్లయి కి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల కిష్టంపల్లి,గాంధీ ఏరియా వరకు ఉన్న గృహావసరాలకు అవసరమగు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరాకు లైన్ క్లియర్ అయింది.కిష్టంపల్లి,గాంధీ ఏరియాలో గల ఇండ్లలో గల సంప్ ల మోటార్ లు,ఫ్యాన్లు కూలర్ లు లో ఓల్టేజ్ కారణంగా తరచూ కాలిపోతున్నయని ఇక్కడి ప్రజలు స్థానిక మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ దృష్టికి తీసుకువచ్చారు.

 Check For Low Voltage Setting Up Transformer For Three Phase Current Supply, Lo-TeluguStop.com

వెంటనే స్పందించిన మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ స్థానిక సెస్ అధికారులను పిలిపించి లో ఓల్టేజ్ ను చెక్ చేయించగా విద్యుత్ సరఫరా లో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని సెస్ అధికారులు తెలిపారు.

శనివారం మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ సిరిసిల్లలో గల సెస్ కార్యాలయానికి వెళ్లి పిర్యాదు చేయగా సోమవారం ట్రాన్స్ఫార్మర్ ను సెస్ కార్యాలయం నుండి సెస్ అధికారులు జెట్టి తిరుపతి,క్యారం లక్ష్మి రాజం హెల్పర్ వెంకటేష్ లు ట్రాన్స్ఫార్మర్ బిగించి ఓల్టేజ్ చెక్ చేయగా త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా అవుతుంది.

దీంతో కిష్టంపల్లి నుండి గాంధీ ఏరియా వరకు ఉన్న ప్రజల కరెంట్ ఇబ్బందులు గట్టెక్కినాయి.త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా కోసం కృషి చేసిన మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ కు ఇక్కడి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube