ఇదేంది భయ్యా.. కేవలం 10 మీటర్లు దూరం సైకిల్ తొక్కితే రూ. పదివేల బహుమతి.. కాకపోతే కండిషన్స్ అప్లై..

మనలో చాలామందికి సైకిల్ తొక్కడం అంటే మహా సరదా.చిన్నతనంలో సైకిల్ ను ఎంతో ఉత్సాహంగా నేర్చుకొని తొక్కేమో.

 If You Ride A Bicycle For Just 10 Meters Then Rs. Ten Thousand Prize.. Otherwis-TeluguStop.com

ఆ తర్వాత స్కూటర్, కార్( Scooter, Car ) అంటూ దానిని మర్చిపోతాము.ఇప్పుడైనా సరే ఎక్కడైనా సైకిల్ కనపడితే మనం కూడా ఒక రౌండ్ వస్తే ఎంత బాగుంటుందో అని అనుకోకుండా ఉండేవారు చాలా తక్కువ.

ఇకపోతే చాలా చోట్ల సైకిల్ పోటీలు నిర్వహించి అందులో ప్రైస్ మనీ ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం.అయితే అందులో పాల్గొనాలని చాలామంది ఉత్సాహత చూపిస్తారు.

అయితే ఆ పోటీల్లో ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది.కాకపోతే ప్రస్తుతం ఓ పోటీ మాత్రం చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ అసలు విషయం తెలిస్తే మాత్రం దేవుడా.

అనడం గ్యారెంటీ.

కేవలం 10 మీటర్ల దూరం సైకిల్ తొక్కితే చాలు పదివేల రూపాయలు సొంతం చేసుకోవచ్చని ఆ పోటీ నిర్వహకులు తెలుపుతున్నారు.ఈ పోటీ వినడానికి చాలా ఆకర్షణంగా ఉన్నప్పటికీ.కానీ అందులో తిరుకాసు ఉండడంతో ఈ ప్రైజ్ మనీని ఇంతవరకు ఎవరు గెలుచుకోలేకపోయారు.

పోటీ దారులు ఇచ్చే సైకిల్ అలాంటిది ఇలాంటిది కాదు మరి.ఈ సైకిల్ పూర్తిగా రివర్స్ మెకానిజంతో పనిచేస్తుంది.ఈ సైకిల్ ఎడమవైపుకు తిప్పితే కుడివైపుకు తిరుగుతుంది., అలాగే కుడి వైపుకు తిప్పితే ఎడమ వైపుకు తిరుగుతుంది.ఇలాంటి విచిత్రమైన సైకిల్ ను ‘లెఫ్ట్ రైట్ సైకిల్( Left Right Cycle ) ‘ అని పిలుస్తున్నారు.

కాబట్టి ఇలాంటి ఓ లాజిక్ మెకానిజం ఉన్న సైకిల్ ని కేవలం 10 మీటర్లు తొక్కితే చాలు పదివేల రూపాయలను అందిస్తున్నారు సదరు పోటీలు నిర్వహించే వ్యక్తులు.ఈ పోటీ భూపాల్ నగరం( Bhopal )లో జరుగుతున్నాయి.కాబట్టి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ గా పాల్గొనాలంటే అక్కడికి వెళ్లాల్సిందే

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube