దళితుల పట్ల వివక్ష చూపిస్తున్నారంటూ ఆందోళనకు దారి తీసిన హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల( Rohit Vemula ) ఆత్మహత్య కేసును పోలీసులు క్లోజ్ చేశారు.2016 జనవరిలో రోహిత్ బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే.
ఎనిమిదేళ్ల తరువాత కేసును క్లోజ్ చేస్తున్నట్లు పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు.ఈ మేరకు తాజా రిపోర్టులో రోహిత్ ఆత్మహత్యకు కారణాలు, ఆధారాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు.ఈ క్రమంలోనే రోహిత్ బలవన్మరణానికి బీజేపీ నేతలు( BJP Leaders ) కారణం కాదని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు.అలాగే కుల ధృవీకరణ పత్రాలను ఫోర్జరీ చేశారని, రోహిత్ దళితుడని చెప్పేందుకు ఆధారాలు లేవని పోలీసులు తెలిపారని సమాచారం.
అయితే పోలీసుల పిటిషన్ పై( Police Petition ) దిగువ స్థాయి కోర్టులో అప్పీలు చేసుకోవచ్చని మృతుని కుటుంబానికి హైకోర్టు సూచించింది.







