హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
TeluguStop.com
దళితుల పట్ల వివక్ష చూపిస్తున్నారంటూ ఆందోళనకు దారి తీసిన హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల( Rohit Vemula ) ఆత్మహత్య కేసును పోలీసులు క్లోజ్ చేశారు.
2016 జనవరిలో రోహిత్ బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే.ఎనిమిదేళ్ల తరువాత కేసును క్లోజ్ చేస్తున్నట్లు పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు.
ఈ మేరకు తాజా రిపోర్టులో రోహిత్ ఆత్మహత్యకు కారణాలు, ఆధారాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు.
ఈ క్రమంలోనే రోహిత్ బలవన్మరణానికి బీజేపీ నేతలు( BJP Leaders ) కారణం కాదని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు.
అలాగే కుల ధృవీకరణ పత్రాలను ఫోర్జరీ చేశారని, రోహిత్ దళితుడని చెప్పేందుకు ఆధారాలు లేవని పోలీసులు తెలిపారని సమాచారం.
అయితే పోలీసుల పిటిషన్ పై( Police Petition ) దిగువ స్థాయి కోర్టులో అప్పీలు చేసుకోవచ్చని మృతుని కుటుంబానికి హైకోర్టు సూచించింది.