సాధారణంగా చెయ్యి లేదా కాలికి చిన్న గాయం అయితేనే చేసే పనుల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటాం.అయితే పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా ఒక వ్యక్తి మాత్రం రోజుకు 16 గంటలు పని చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చికి చెందిన వైతీశ్వరన్( Vaitheswaran ) సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.అన్ని అవయవాలు ఉన్నా ఉద్యోగం సాధించడంపై దృష్టి పెట్టని వాళ్లు వైతీశ్వరన్ ను స్పూర్తిగా తీసుకుంటే మంచిది.
2 సంవత్సరాల వయస్సులోనే పోలియో బారిన పడిన వైతీశ్వరన్ రెండు కాళ్లు పడిపోవడంతో బాల్యం నుంచి ఇబ్బందులను ఎదుర్కొన్నారు.అయితే అంగ వైకల్యం తన సక్సెస్ ను ఆపలేదని ప్రూవ్ చేస్తూ ఆ వ్యక్తి రెండు పీజీలను పూర్తి చేశారు.
చదువు పూర్తైన తర్వాత వైతీశ్వరన్ కు ఒక హెల్త్ కేర్ సంస్థలో ఉద్యోగం వచ్చింది.ఆ సంస్థలో ప్రస్తుతం వైతీశ్వరన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్నారు.

ఒకవైపు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే మరోవైపు స్విగ్గీ డెలివరీ బాయ్ గా పని చేస్తున్న వైతీశ్వరన్ సక్సెస్ స్టోరీ ఎంతోమందిలో స్పూర్తి నింపుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.వైతీశ్వరన్ పోలియో బారిన పడకుండా ఉండి ఉంటే కెరీర్ పరంగా సులువుగా ఎన్నో విజయాలను సొంతం చేసుకుని ఉండేవారని చెప్పవచ్చు.

నేటి తరంలో తల్లీదండ్రులు లక్షలు ఖర్చు చేసి చదివిస్తున్నా ఆ డబ్బులను వృథా చేస్తున్న పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.అలాంటి వాళ్లు వైతీశ్వరన్ సక్సెస్ స్టోరీని తెలుసుకుంటే కొంతైనా మారే అవకాశాలు అయితే ఉంటాయి.ఎంతోమంది యువతీయువకులతో పోల్చి చూస్తే వైతీశ్వరన్ భిన్నమని చెప్పడంలో సందేహం అవసరం లేదు.ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వైతీశ్వరన్ సక్సెస్ స్టోరీ వైరల్ అవుతోంది.







