ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.ఇందులో భాగంగా నరసాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ (CM Jagan)పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.పది రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని సీఎం జగన్ తెలిపారు.
ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయన్నారు.చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు పలికినట్లేనని పేర్కొన్నారు.చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనన్న సీఎం జగన్ చంద్రబాబు(CM jagan , Chandrababu) ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని మండిపడ్డారు.14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు.
జగన్ ఇచ్చిన పథకాలు చంద్రబాబు(chandrababu) ఎప్పుడైనా ఇచ్చారా అని నిలదీశారు.నాడు – నేడుతో(Mana Badi Nadu Nedu ) విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు.58 నెలల పాలనలో జగనన్న విద్యాదీవెన, విదేశీ విద్య (Jagananna Vidyadevena, foreign education)వంటి పథకాలను ప్రవేశపెట్టామని చెప్పారు.అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు డిజిటల్ బోధన అందిస్తున్నామని తెలిపారు.
ప్రతి రంగంలోనూ విప్లవం సృష్టించామన్న సీఎం జగన్ గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని వెల్లడించారు.







