యాదాద్రి భువనగిరి జిల్లా:ఈ జిల్లాను దొంగలు పగ పట్టినట్లున్నారు.జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.
పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి దొరకకుండా వరుస చోరీలకు తెరలేపడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.బుధవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఒకేరోజు నాలుగు ఇండ్లల్లో చోరీకి పాల్పడ్డారు.
ఊరికి చివరగా ఉన్న ఇండ్లనే టార్గెట్ గా చేసుకొని తాళాలు పగలగొట్టి దొంగలు బీభత్సం సృష్టించారు.ఊట్ల వీరేశం ఇంట్లో మూడు తులాల బంగారం,20 తులాల వెండి, రూ.20 వేల నగదు,అన్నోజు సత్తయ్య ఇంట్లో ఇరవై తులాల వెండి 2000 నగదు,తవ్విటి సోమక్క ఇంట్లో 6000 నగదు, గవ్వల చంద్రమ్మ 2000 నగదు అపహరించినట్లు బాధిత కుటుంబాలు చెబుతున్నారు.సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై యాకన్న క్లూస్ టీం తోటి ఇండ్లను పరిశీలన చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.







