యాదాద్రి భువనగిరి జిల్లా:మునుగోడు ప్రజల ఆశీర్వాదంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని,ఇప్పుడు ఇక కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కృషి చెయ్యాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.గురువారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సిపిఐ పార్టీ బలపరిచిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రచార ర్యాలీని నిర్వహించారు.
మండల ప్రజలు ఆయనకు గజ మాలతో ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాజరై మాట్లాడుతూ మునుగోడు ప్రజలు ఆశీర్వదించి నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపారని,మరొకసారి నామీద నమ్మకంతో భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా బరిలో ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డిని పార్లమెంటుకు పంపే బాధ్యత మీ అందిరిపైన ఉందన్నారు.
చామలను మునుగోడు నుండి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాట ఇచ్చానని పేర్కొన్నారు.పది సంవత్సరాల్లో చేయని పనులు వంద రోజుల్లో చేసామని,బీఅర్ఎస్,బీజేపీ ప్రభుత్వాలు మధ్యతరగతి కుటుంబాలను అన్యాయం చేసారు తప్ప న్యాయం చేయలేదన్నారు.
ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం మునుగోడు,భువనగిరి అభివృద్ధికి ఐదు సంవత్సరాలో అభివృద్ధి అంటే ఏందో చేసి చూపిస్తాం,ఆగస్టు 15 లోపు రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మునుగోడు ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నల్గొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పున్న కైలాష్ నేత,ఎంపీపీ గుప్తా ఉమాదేవి,జడ్పిటిసి వీరమల్ల భానుమతి,మాజీ ఎంపిపి బుజ్జి,మండల అధ్యక్షుడు ఏపూరి సతీష్, ముద్దంగుల నర్సింహ, ఉప్పల లింగస్వామి,గుత్తా ప్రేమ్ చందర్ రెడ్డి, బచ్చనగోని గాలయ్య, సీపీఐ నాయకులు దుబ్బాక భాస్కర్,జక్కడి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు
.