నల్లగొండ జిల్లా: తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి విడుదల చేశారు.ఈ ఫలితాల్లో కూడా బాలికలే పైచేయి సాధించారు.టెన్త్ ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత సాధించారు.3927 స్కూళ్లలో వంద శాతం ఫలితాలు సాధించారు.
99శాతం ఫలితాల తో నిర్మల్ జిల్లా టాప్ ప్లేస్ లో ఉండగా 65.10 శాతంతో వికారాబాద్ చివరి స్థానంలో నిలిచింది.ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 96.91శాతంతో సూర్యాపేట రాష్ట్రంలో 6వ,స్థానంలో ఉండగా,96.11 శాతంతో నల్లగొండ 9వ,స్థానంలో నిలవగా,90.44 శాతంతో యాదాద్రి భువనగిరి జిల్లా 25 వ స్థానంలో దక్కించుకుంది.