తెలుగు సినిమా ప్రేక్షకులకు హీరోయిన్ మాళవిక మోహనన్( Malavika Mohanan ) గురించి వ్యతిరేకంగా చెప్పాల్సిన పనిలేదు.తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి హీరోయిన్ మాళవిక మోహనన్ బాగా సూపరిచితమే.
ఈమె సినిమాల ద్వారా కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకుంది.కాగా సినిమా ఇండస్ట్రీలో అందం అభినయం కలబోసిన హీరోయిన్ లలో మాళవిక మోహనన్ కూడా ఒకరు.
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన పేట సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకుంది.

పేట సినిమా తర్వాత దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో( Master Movie ) హీరోయిన్ గా నటించి మెప్పించింది.మాస్టర్ మూవీ హిట్ తో ఈ అమ్మడుకి అవకాశాలు క్యూ కట్టాయి.దీంతో ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
ఇకపోతే మాళవిక పేరు వినగానే ముందుగా అభిమాలకు గుర్తుకు వచ్చేది ఆమె అందం.తరచూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఇటీవల కాలంలో సెలబ్రిటీలు కాస్త సమయం దొరికింది అంటే చాలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.తాజాగా కూడా మాళవిక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది.ఆస్క్ మాళవిక( Ask Malavika ) పేరుతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ను నిర్వహించారు.ఆమె ఇష్టాయిష్టాలు, రాబోయే సినిమాల గురించి పలువురు అడగ్గా.ఒక నెటిజన్ మాత్రం నటి అసహనానికి గురయ్యేలా ప్రశ్నించాడు.గ్లామర్ షోకు బదులు నటించడం ఎప్పుడు ప్రారంభిస్తారు అని ప్రశ్నించగా.
ఆ ప్రశ్నకు నేను చేయను.నీకు ఏమైనా ఇబ్బందా? అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది మాళవిక. ఆ కామెంట్ పై స్పందించిన పలువురు నెటిజెన్స్.ఫీల్ అవ్వకండి మీరు అలాంటి వారికి ఎందుకు ఆన్సర్ ఇస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం అందుకు సంబందించిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.