ఏపీలో మరోసారి ఫ్యాన్ ప్రభంజనం సృష్టించబోతుందా ? అంటే అవుననే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ సంస్థలు సర్వేలు నిర్వహించారు.
ఈ క్రమంలోనే మరోసారి ఏపీలో వైసీపీదే అధికారమని చెబుతూ సర్వే ఫలితాలను వెల్లడించాయి.తాజాగా మరో సర్వే సంచలన ఫలితాలతో బయటకు వచ్చింది.
‘ఆంధ్ర లైవ్ న్యూస్’( Andhra Live News ) నిర్వహించిన సర్వేలో ఈసారి కూడా జగన్ పార్టీ హవా కొనసాగుతుందని తేలిపోయింది.
అసెంబ్లీ ఎన్నికలకు( assembly elections ) మరి కొద్ది రోజుల మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో… పొలిటికల్ పార్టీలన్నీ అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి.
రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.విజయాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.అయితే.ఏపీలో ఈసారి ఓటరు నాడి ఎలా ఉంది? ప్రజలు ఎవరికి అధికార పీఠాన్ని అప్పగిస్తారనే విషయాలపై ఏఎల్ఎన్ సర్వే (ఆంధ్ర లైవ్ న్యూస్ ) సర్వే చేసింది.

ప్రస్తుతం బయటకు వచ్చిన ఏఎల్ఎన్ సర్వే ఫలితాలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు.రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా సుమారు 31 రోజులపాటు ఏఎల్ఎన్ ప్రజాభిప్రాయాలను సేకరించింది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే చేసిన ఆంధ్ర లైవ్ న్యూస్ ఫలితాలను విడుదల చేసింది.దీని ప్రకారం రానున్న ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అత్యధికంగా 149 స్థానాల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని తేలింది.
అలాగే పొత్తుతో వస్తున్న టీడీపీ – బీజేపీ – జనసేన( TDP – BJP – Jana Sena ) కూటమి కేవలం 26 సీట్లను గెలుపొందే ఛాన్స్ ఉందని సర్వే పేర్కొంది.ఇక కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా గెలుపొందే అవకాశం లేదని ఏఎల్ఎన్ సర్వే ఫలితాల్లో వెల్లడి అయింది.

వైసీపీ( YCP ) మొత్తం 51 ఓటింగ్ షేరుతో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోనుందని ఏఎల్ఎన్ సర్వే ఫలితాలు తేల్చాయి.ఇక టీడీపీ కూటమికి 41 ఓటింగ్ శాతం వచ్చే ఛాన్స్ ఉండగా.కాంగ్రెస్ కు 4 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.కాగా జగన్ పాలనపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం అవుతోంది.అలాగే కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి వైఎస్ జగన్ అందించిన సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సర్వేలో పేర్కొన్నారు.వాలంటీర్ వ్యవస్థ మరియు విద్య, వైద్య రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలతో పాటు విత్తనం నుంచి విక్రయాల వరకు రైతన్నలకు అండగా నిలుస్తూ.
వ్యవసాయ రంగంలోనూ విప్లవాత్మక మార్పులను ప్రవేశ పెట్టడంపై ఏపీ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాల్లో జగన్ పై విశేషాదరణ కనిపిస్తుందని ఆంధ్ర లైవ్ న్యూస్ సర్వేలో తేలింది.
ఏపీలో వైఎస్ జగన్ కు, వైసీపీకి తిరుగులేదని అర్థం అవుతుంది.ఈ క్రమంలోనే మరోసారి ఫ్యాన్ ప్రభంజనం కొనసాగనుందని వెల్లడైంది.
ఏఎల్ఎన్ సర్వే ఫలితాలు ఏపీలో ప్రజాభిప్రాయానికి అద్దం పట్టాయని తెలుస్తోంది.







