కింగ్ కోబ్రా( King Cobra ) అత్యంత భయపడే పాము అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అవి ఒకవేళ కాటువేస్తే.
మనుగడ దాదాపు అసాధ్యం.అందుకే అనుభవజ్ఞులైన వ్యక్తులు కూడా ఈ పాములను( Snakes ) చూడగానే చాలా జాగ్రత్తగా ఉంటారు.
ఈ పాములను చూసి జంతువులు కూడా పారిపోతాయి.కానీ కొన్నిసార్లు ఈ నాగుపాములు కొన్ని జంతువుల వద్ద విఫలమవుతాయి.
ఈ నేపథ్యంలో పలువురి దృష్టిని ఆకర్షించే ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఓ కోతి,( Monkey ) కింగ్ కోబ్రాతో కబడ్డీ ఆడింది.ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే.
అక్కడి నుంచి తప్పించుకోవడం అసాధ్యం అయినప్పటికీ, కోబ్రా కాటును నేర్పుగా తప్పించుకుంటూ కోతి ఎదురుదాడి చేస్తుంది.పాము కాటు వేయడానికి ప్రయత్నించిన ప్రతిసారీ, కోతి పాముపై గోర్లతో గికదానికి ప్రయత్నిస్తుంది.
ఇలా పునరావృతం చేయడంతో నాగుపాముకి చుక్కలు కనిపిస్తున్నాయి.

చివరకు కోతితో పోరాడలేక తోక ముడివేసి అక్కడి నుంచి పారిపోయింది పాము.ఈ ఎపిసోడ్‌లో, నాగుపాము కోతిని చాలాసార్లు కాటు వేయడానికి ప్రయత్నిస్తుంది ఈ ఘటన మొత్తాన్ని అక్కడున్న వారు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
‘కోతిని కట్టేసి వేడుక చూడడం బాగోలేదు’ అన్నారు కొందరు.మరికొందరు “జంతువులను ఈ విధంగా హింసించేవారిని కఠినంగా శిక్షించాలి” అని అన్నారు.







