మంగళగిరిలో లోకేష్ పరిస్థితేంటి ?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( TDP Nara Lokesh ) మంగళగిరి నియోజకవర్గం  నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు .2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతుల్లో ఓటమి చెందారు.అక్కడ ఓటమి చెందడం తో లోకేష్ రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.వైసిపి( YCP ) పదేపదే లోకేష్ ఓటమిని హైలెట్ చేస్తూ విమర్శలు చేయడం వంటివి అన్నీ లోకేష్ ను బాగా బాదించాయి.

 Nara Lokesh Plans To Win In Mangalagiri Constituency,mangalagiri, Nara Lokesh, C-TeluguStop.com

దీంతో మళ్లీ అదే నియోజకవర్గ నుంచి పోటీ చేసి గెలవాలనే పట్టుదల లోకేష్ లో బాగా కనిపిస్తోంది.అందుకే మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.  అక్కడ గెలిచి రాజకీయంగా సక్సెస్ కావాలనే ఆలోచనతో ఉన్నారు.దీంతో వైసిపి కూడా లోకేష్ ను ఓడించేందుకు అంతే స్థాయిలో వ్యూహాలు పన్నుతోంది .


Telugu Ap, Chandrababu, Lavanya, Mangalagiri, Lokesh, Lokeshwin, Pawan Kalyan-Po

ముందుగా ఇక్కడ వైసిపి అభ్యర్థిగా గంజి చిరంజీవి( Ganji Chiranjeevi )ని ప్రకటించినా,  ఆ తర్వాత మార్పు చేసి మురుగుడు లావణ్యను అభ్యర్థిగా పోటీకి దించారు. మంగళగిరి( Mangalagiri )లో చేనేత సామాజిక వర్గం లో ఎక్కువగా ఉండడం మురుగుడు లావణ్య తల్లి, మామ  రాజకీయంగా ఈ నియోజకవర్గంలో గట్టిపట్టు ఉన్నవారు కావడంతో లావణ్య బలమైన అభ్యర్థి అవుతారు అనే ఆలోచనతో వైసీపీ ఉంది .ఇక లోకేష్ ఇక్కడ గెలిచేందుకు అన్ని పరిస్థితులు తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.ఎక్కువగా  పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం( Election Campaign ) చేస్తున్నారు రాష్ట్ర రాజకీయ వ్యవహారాలను ఎన్నికల ప్రచారాలను పక్కనపెట్టి పూర్తిగా మంగళగిరికే లోకేష్ పరిమితం అయ్యారు.

Telugu Ap, Chandrababu, Lavanya, Mangalagiri, Lokesh, Lokeshwin, Pawan Kalyan-Po

 రాజకీయంగా నియోజకవర్గంలో పట్టు సాధించినట్లుగానే లోకేష్ కనిపిస్తున్నారు. వైసీపీ( YCP )లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీటు నిరాకరించడం , ఆ తరువాత గంజి చిరంజీవిని అభ్యర్థిగా మార్చడం, ఆయనను మార్చి మురుగుడు లావణ్య( Murugudu Lavanya )ను తెరపైకి తీసుకురావడం ఇవన్నీ గందరగోళంగానే మారాయి.లోకేష్ గడపగడపకు తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ,  మంగళగిరిలో గెలిచేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు .ప్రస్తుతం లోకేష్ పరిస్థితి కాస్త ఆశాజనంగానే ఉన్నట్టుగానే ఇక్కడ పరిస్థితులు నెలకొన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube