టీడీపీ నేత సోమిరెడ్డిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి( Minister Kakani Govardhan Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.
గత ఎన్నికల్లో ఈసీ చేర్చిన ఎఫ్ఐఆర్ లో తమ పేరుందని నిరూపిస్తారా అని మంత్రి కాకాణి ప్రశ్నించారు.మద్యం దొరికిన రైస్ మిల్లు యజమానికి, తనకు సంబంధం ఉందని నిరూపిస్తారా? అని నిలదీశారు.పొదలకూరు చంద్రబాబు( Chandrababu ) సభకు ఐదు వేల మంది కూడా రాలేదన్నారు.ఈ క్రమంలోనే సోమిరెడ్డి( Somireddy ) బతుకంతా అవినీతిమయమన్న మంత్రి కాకాణి ఓటర్లకు డబ్బులు పంచుతున్న సోమిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయాలని సీఈసీకి ఫిర్యాదు చేశానని తెలిపారు.