నందమూరి నటసింహ బాలకృష్ణ( Balakrishna ) వ్యక్తిత్వం గురించి ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి ఆయన అభిమానుల పట్ల చిన్నచూపు చూస్తారని వారిపై చేయి చేసుకుంటారని చాలామంది విమర్శలు చేశారు అయితే తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్( Director KS Ravi Kumar ) ఇదివరకు బాలయ్య గురించి పలు విమర్శలు చేశారు తాజాగా మరోసారి బాలకృష్ణ గురించి ఈయన మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.బాలయ్యకు సంస్కారం లేదని సైకోగా మారారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేఎస్ రవికుమార్ ఒక సందర్భంలో బాలయ్య గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నటువంటి ఈయన బాలయ్య హీరోగా కూడా పలు సినిమాలకు దర్శకత్వం వహించారు.సాగర సంగమం భారీ విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారకరామారావు తన కొడుకు బాలయ్యతో కూడా సినిమా చేయమని కోరారు.దీంతో జనని జన్మభూమి ( Janani Janmabhumi ) టైటిల్ తో కే విశ్వనాథ్ బాలయ్య హీరోగా సినిమా చేశారు.
ఈ సినిమాకు తాను అసోసియేటెడ్ డైరెక్టర్గా పని చేశానని తెలిపారు.
ఇక ఈ సినిమా మా ఊరి పరిసర ప్రాంతాలలోనే జరిగింది.యుక్త వయసులో ఉన్నప్పుడు బాలయ్య చాలా అందరితో నవ్వుతూ సరదాగా ఉండేవారు అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో బాలయ్య అభిమానులు( Balakrishna Fans ) తనని చూడటం కోసం వస్తే బాలకృష్ణ వారందరితో కలిసి ఫోటోలు దిగుతున్నారు.అయితే ఒక అభిమాని తనతో ఫోటోదిగే సమయంలో తన భుజంపై చేయి వేశారు.
దీంతో కోపం కట్టలు తెంచుకున్నటువంటి బాలయ్య తనపై చేయి చేసుకున్నారు.ఆ ఘటన చూసి నాకు మనసు విరిగిపోయిందని తెలిపారు.
ఒకప్పుడు ఎంతో సరదాగా ఉండే బాలయ్య ఇప్పుడు సైకోలా( Psycho ) మారిపోయారని సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారని తెలిపారు.అలా అభిమానులను కొట్టినప్పుడు వారు తిరిగి కొడితే నీ పరిస్థితి ఏంటి అని ఈ సందర్భంగా కేఎస్ రవికుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.