సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ( Posani Krishna Murali ) కీలక వ్యాఖ్యలు చేశారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మండిపడిన ఆయన పవన్ దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు.
వాలంటీర్లను, ఆడపడుచులను పవన్ కల్యాణ్( Pawan Kalyan ) అవమానించారని పోసాని కృష్ణమురళీ ధ్వజమెత్తారు.కాపు సోదరులను మళ్లీ మోసం చేయాలని పవన్ చూస్తున్నారని తెలిపారు.
గతంలో చంద్రబాబును నీచంగా పవన్ తిట్టాడన్న పోసాని ఇప్పుడు పవన్ కల్యాణ్ మళ్లీ చంద్రబాబు( Chandrababu ) కాళ్ల వద్దకు చేరాడని ఎద్దేవా చేశారు.చంద్రబాబు సీఎలం ఎలా అవుతారో చూస్తానని పవన్ అన్న వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు.
పవన్ కు డబ్బు, అధికారమే కావాలని పేర్కొన్నారు.అధికారం కోసం చంద్రబాబు ఎన్ని కుట్రలైనా పన్నుతారని ఆరోపించారు.
ఈ క్రమంలోనే జగన్ ను చంపడానికి కూడా చంద్రబాబు వెనుకాడరని పోసాని ఆరోపణలు చేశారు.