ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించి అనేక వీడియోలు వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉన్నాం.తాజాగా ఓ భయంకరమైన పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మామూలుగా మనం పాముల్ని( Snakes ) చూస్తేనే ఆమడంతో దూరం పారిపోతాం.అవి మనల్ని ఏవో ఒకటి చేస్తాయని దాని నుంచి తప్పించుకోవడానికి దూరంగా ఉండిపోతాం.
మామూలుగా పాములు అడవి ప్రాంతంలో, గుట్టలు, చెట్ల వద్ద ప్రదేశాల్లో ఉంటాయి.
ఎలుకలు లేదా చిన్నచిన్న జంతువుల్ని ఆహారంగా తీసుకొని పాములు జీవనం కొనసాగిస్తాయి.
మరికొందరు పాముల్ని దైవంగా కూడా కొలిచేవారు లేకపోలేదు.అలాంటివారు పాములను చూడగానే ఎలాంటి హానిని తలపెట్టకుండా స్నేక్ సొసైటీ వారికి సమాచారం అందించి వాటిని సుదూర ప్రాంతంలో క్షేమంగా వదిలిపెట్టడానికి ప్రయత్నిస్తారు.
ఇకపోతే తాజాగా వైరల్ గా మారిన వీడియోలో అసలు విషయం చూస్తే.

మామూలుగా కొన్ని రకాల పాములకు సంబంధించిన వీడియోలు చూస్తేనే ఒక్కోసారి భయపడతాం.కొందరైతే అసలు పాములకు సంబంధించిన వీడియోలు అసలు చూడడానికి ఇష్టపడరు.అయితే అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని మాత్రం కచ్చితంగా చూడొద్దని చెప్పవచ్చు.
ఇక వైరల్ గా మారిన వీడియోలో ఓ కింగ్ కోబ్రా( King Cobra ) మరో రెండు పాములను ఒకేసారి తన నోటితో కరుచుకొని ఒక చోట నుంచి మరో చోటికి స్పీడుగా వెళ్తుంది.తన నోట్లో ఉన్న రెండు పాములు ఎక్కడ జారిపోతాయో అన్నట్టుగా చాలా స్పీడ్ గా పరిగెడుతుంది కింగ్ కోబ్రా.

అయితే ఈ వీడియోను ఎవరు తీసారో కానీ వారి ధైర్యానికి మెచ్చుకోవచ్చు.ఇక ఈ వీడియో ఎక్కడిదన్న విషయాలు మాత్రం తెలియరాలేదు.కాకపోతే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజెన్స్ ఒకింత భయభ్రాంతులకు లోనవుతున్నారు.మరికొందరైతే ఒక్క కింగ్ కోబ్రా రెండు పాములను ఇలా హాని తలపెట్టడం విడ్డూరం అంటూ కామెంట్లు చేస్తున్నారు.







