నల్లగొండ జిల్లా: కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం యువజన కాంగ్రెస్ నాయకులు పటిష్టంగా పనిచేయాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూ నాయక్ పిలుపునిచ్చారు.ఆదివారం నల్లగొండ జిల్లా దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గం అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ యువజన కాంగ్రెస్ సన్నాహ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చేందుకు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో శ్రమించాలన్నారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యువజన కాంగ్రెస్ నాయకులకు తగిన ప్రాధాన్యత లభిస్తుందని, అందుకోసం యువజన కాంగ్రెస్ నాయకులు ప్రతి గ్రామాల్లో,తండాల్లో ప్రతి కుటుంబాన్ని కలుస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన గ్యారెంటీలను
పేద,మధ్య తరగతి ప్రజలకు అందే విధంగా పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు.ప్రభుత్వ అందించే సంక్షేమ పలాలను ఏ విధంగా అందిస్తుంది వివరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ స్థానాలు 13 నుండి 14 స్థానాలు గెలిచే విధంగా, నల్గొండ పార్లమెంట్ లో రఘువీర్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని,బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలు యువతకు చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏమేమి అందిస్తుందో చెప్పాలన్నారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్ర రాంసింగ్, అమటి శివ,రమేష్, బాలకృష్ణ,మేడే సైదులు, యువజన కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.