రాజన్న సిరిసిల్ల జిల్లా : కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు తన కుమార్తె తో కలిసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు.ఈ సందర్భంగా కోర్కెలు తీర్చే కోడె మొక్కును చెల్లించుకున్నారు.
తొలుత ఆలయ అర్చకులు రాజేంద్ర రావుకు స్వాగతం పలికారు.అనంతరం గర్భ గుడిలోకి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాజేందర్ రావు వెంట వేములవాడ ఎమ్మెల్యే తనయుడు, యువ నాయకుడు ఆది కార్తీక్ తదితరులు ఉన్నారు.







