ఇప్పుడున్న కాలంలో హీరోయిన్స్( Heroines ) కేవలం అందాల ప్రదర్శన మాత్రమే చేస్తున్నారు.కాని వారికి నటన అంటే ఏంటో పూర్తిగా తెలియదు ఒకప్పుడు గ్లామర్ నీ పక్కన పెట్టి కేవలం ఎక్స్ప్రెషన్స్ మీద పట్టు ఉన్న హీరోయిన్స్ అలాగే బాగా నటించగలిగే నటీమణులను మాత్రమే ఇండస్ట్రీ ఎంకరేజ్ చేసేది.
కానీ ఆ పరిస్థితులు పూర్తిగా పోయాయి.తెల్లతోలు ఉంటే చాలు వారిని ఎలాగోలా హీరోయిన్స్ గా తీసుకొచ్చేస్తున్నారు.
నటన తెలియకపోయినా( Acting ) అవసరం లేదు.డబ్బులు కూడా బాగానే డిమాండ్ చేస్తున్నారు.
పైగా అంగంగా ప్రదర్శనకు ఎలాంటి అడ్డు చెప్పడం లేదు.అందుకే గత తరం హీరోయిన్స్ కి ఇప్పటి తరహా హీరోయిన్స్ కి కెరియర్ పరంగా చాలా తేడా ఉంటుంది.
గతంలో పదేళ్లు, 15 ఏళ్లు, 20 ఏళ్లు కూడా హీరోయిన్స్ గా రాణించేవారు.ఇప్పుడు మూడేళ్లు కనిపిస్తే మహా గొప్ప అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి.
ఉదాహరణకు నటి ఆమని( Actress Aamani ) ని తీసుకోండి.ఆమె రంగు చాలా తక్కువ నిజం చెప్పాలంటే నలుపు.అయినా కూడా ఆమె ఎంతో పరిణతి చెందిన నటన కనిపిస్తుంది.పైగా ఆమె ముఖ కవలికలు ఎంతో అద్భుతంగా ఉంటాయి.రంగు తక్కువైనా రూపం లో ఎలాంటి లోపం ఉండదు.ఆమె నటించిన సినిమాలు గమనిస్తే బాపు బొమ్మ గా మిస్టర్ పెళ్ళాం సినిమా( Mister Pellam )లో ఆమె వయ్యారాలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు.
పొద్దున్నే లేచి ముగ్గు పెట్టి ఇంటి పని అంతా చేసే తెలుగింటి ఆడపడుచు గా ఆమె చేసిన నటన మర్చిపోవడం అంత సాధ్యం కాదు.గడుసరి అమ్మాయిగా జగపతిబాబు పక్కన కూడా అనేక సినిమాల్లో కనిపించి ఫ్యామిలీ ఆడియన్స్( Family Audiance ) ని ఆకట్టుకుంది.
అసలు ఆమని లాంటి హీరోయిన్ ఇప్పటి కాలంలో దొరకడం చాలా కష్టం.అప్పట్లో హీరోయిన్స్ కి కొరత ఉండేది.కానీ మంచి నటీమణులు మాత్రమే ఉండేవారు.ఇప్పుడు హీరోయిన్స్ కి కొదవలేదు కానీ నటన అంటే ఏంటో తెలియడం లేదు.అదే పెద్ద తేడా అప్పటి వారికి ఇప్పటి వారికి.ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించి అలాగే అందులోనే డ్యూయెట్స్ కూడా ఉండేవి.
అలాంటి సినిమాల్లో ఆమని ఎక్కువగా కనిపించి ప్రేక్షకులను సంపాదించుకుంది.ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్( Character Artist ) గా బాగానే బిజీగా ఉంది కానీ నాటి ఆమని ఆ గడసరి పాత్రలను చాలామంది మిస్ అవుతున్నారు.