టెనెంట్ సినిమా రివ్యూ అండ్ రేటింగ్!

ప్రేక్షకులు ఎప్పుడు ఒకే ధోరణిలో సినిమాలు కాకుండా విభిన్న కాన్సెప్ట్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాలను ఎంతగానో ఆదరిస్తూ ఉంటారు ముఖ్యంగా మర్డర్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడు మంచి ఆదరణ ఉంటుంది.సరైన కథాంశంతో ఈ సినిమాని కనుక ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తే ఇలాంటి సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు అనే సంగతి తెలిసిందే.

 Tenant Movie Review And Rating ,tenant, Satyam Rajesh, Megha Chowdary, Tollywood-TeluguStop.com

అయితే తాజాగా ఇలాంటి ఒక మర్డర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం టెనెంట్( Tenant ) .  సత్యం రాజేష్ ( Satyam Rajesh ) , మేఘా చౌదరి జంటగా దర్శకుడు వై.యుగంధర్ తెరకెక్కించారు.మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై మోగుళ్ల చంద్రశేఖర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ రోజు విడుదల అయినటువంటి ఈ సినిమా ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుని ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే.

కథ:

గౌతమ్( సత్యం రాజేష్ ) సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తూ ఉంటారు ఇక ఈయనకు  సంధ్య(మేఘా చౌదరి) భార్య ఉంటుంది.వీరిద్దరూ ఎంతో సంతోషంగా ఉంటూ ఆ అపార్ట్మెంట్లో అందరీ చేత మంచివాళ్ళుగా గుర్తింపు పొందుతారు.

ఇలా ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్నటువంటి వీరి  పక్క ఫ్లాట్ లో ఉంటున్న ఇద్దరు అమ్మాయిలు రమ్య పొందూరి, మేగ్న పరిచయమవుతారు.వీరిద్దరూ కూడా సంధ్యతో క్లోజ్ అయ్యి… ఆమెతో పరిచయం పెంచుకుంటారు.

ఈ పరిచయం వీరి మధ్య స్నేహానికి దారితీస్తుంది.అయితే ఓ రోజు ఉన్నట్టుండి సంధ్య శవాన్ని ఓ సూట్ కేసులో గౌతమ్ వేసుకుని పోయి… నగరానికి దూరంగా ఓ నిర్మాణుషంగా ఉండే ప్రదేశంలో శవాన్ని తగులబెడతాడు.

తన భార్యను తగలబెట్టినటువంటి ఈయన తన భార్య కనిపించడం లేదంటూ పోలీస్ కంప్లైంట్ ఇస్తారు ఇక ఈ మర్డర్ కేస్ చేదించడానికి  ఓ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ లేడీ ఆఫీసర్(ఏస్తర్)ని నియమిస్తారు.మరి ఈ మర్డర్ మిస్టరీని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎలా చేధించింది? సంధ్య మరణానికి కారకులు ఎవరు? ఆమె శవాన్ని తన భర్త ఎందుకు రహస్యంగా కాల్చాల్సి వచ్చింది? వీరి జీవితంలోకి ఎంటర్ అయిన మరొక జంట ఏమైంది? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Telugu Megha Chowdary, Satyam Rajesh, Lady, Tenant, Tenant Review, Tollywood, Yu

నటీనటుల నటన:

సత్యం రాజేష్ మేఘ చౌదరి ఇద్దరు కూడా భార్య భర్తలుగా ఎంతో అద్భుతంగా నటించారు.ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎస్తర్ ( Esther ) చాలా అద్భుతంగా నటించారు.ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా వారి పాత్రలకు వంద శాతం న్యాయం చేశారని చెప్పాలి.

టెక్నికల్:

  దర్శకుడు యుగంధర్ ఓ మెసేజ్ ఓరియంటెడ్ ప్లాట్ ను ఎంచుకోవడం నేటి తరం అమ్మాయిలకు ఎంతో ఉపయోగం.ముఖ్యంగా మెట్రో పాలిటన్ సిటీస్ లో జీవించే అమ్మాయిలకు ఇలాంటి సినిమాలు ఎంతో ఉపయోగపడతాయి.సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.విజువల్స్ బాగున్నాయి.సత్యం రాజేష్, మేఘా చౌదరి జంటను అందంగా చూపించారు.

ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది.మ్యూజిక్ కూడా బాగుంది నిర్మాణాత్మక విలువలు అద్భుతంగా ఉన్నాయి నిర్మాతలు ఎక్కడా కూడా కాంప్రమైస్ కాలేదు.

విశ్లేషణ:

మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలకు ప్రధానంగా ఉండాల్సింది… ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే.ఈ సినిమాలో కూడా అదే ప్రధాన ఆకర్షణ.

ఇక ఈ సినిమా చివరి వరకు ఎంతో ఉత్కంఠ భరితంగా ఉంటుంది ఎక్కడా కూడా ట్విస్టులను రివీల్ చేయకుండా చివరి వరకు అదే ఉత్కంఠ భరితంగా సినిమాని డైరెక్టర్ ముందుకు నడిపించారు.మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగం మరింత ఆసక్తికరంగా ఉంటుంది ఇక క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది ఈ సినిమా ద్వారా కొత్త వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని ఒక సందేశాన్ని చూపించారని చెప్పాలి.

Telugu Megha Chowdary, Satyam Rajesh, Lady, Tenant, Tenant Review, Tollywood, Yu

ప్లస్ పాయింట్స్:

కథ, కథనం, నటినటుల నటన, రెండో భాగం.

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ కాస్త బోర్ కొట్టే సన్నివేశాలు.

Telugu Megha Chowdary, Satyam Rajesh, Lady, Tenant, Tenant Review, Tollywood, Yu

బాటమ్ లైన్:

ఈ విధమైనటువంటి మర్డర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పటికీ ఎన్నో వచ్చినా కూడా ఈ సినిమా సరికొత్తగా ప్రేక్షకులను చివరి క్షణం వరకు ఉత్కంఠ భరితంగా ఎదురుచూసేలా ఉందని చెప్పాలి మొత్తానికి ఒక మంచి సినిమా చూస్తామని భావన కలుగుతుంది.

రేటింగ్:

3/5

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube