సాధారణంగా లక్షల రూపాయల వేతనం వచ్చే ఉద్యోగాన్ని వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు.అయితే వార్ధాఖాన్( Vardha Khan ) అనే యువతి మాత్రం సివిల్స్ పై దృష్టి పెట్టి 18వ ర్యాంక్ సాధించి వార్తల్లో నిలిచారు.
యూపీలోని నోయిడా సెక్టార్ ( Noida Sector in UP ) కు చెందిన వార్దాఖాన్ తల్లీదండ్రులకు ఏకైక సంతానం కాగా తొమ్మిదేళ్ల క్రితం ఆమె తండ్రిని కోల్పోయారు.ప్రస్తుతం వార్దాఖాన్ తల్లితో కలిసి ఉంటున్నారు.
వార్ధాఖాన్ ఢిల్లీలోని ఖల్సా కాలేజ్( Khalsa College, Delhi ) నుంచి బీకామ్ హానర్స్ పూర్తి చేశారు.చదువు పూర్తైన తర్వాత వార్ధాఖాన్ కు కార్పొరేట్ కంపెనీలో జాబ్ వచ్చింది.
అయితే ఆ జాబ్ సంతృప్తిని ఇవ్వకపోవడంతో పాటు వార్ధాఖాన్ సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో సివిల్స్ ను ఎంచుకున్నారు.ఎంతో కష్టపడి వార్ధాఖాన్ తన కలను నెరవేర్చుకోవడం గమనార్హం.24 సంవత్సరాల వయస్సులోనే సివిల్స్ సాధించిన వార్ధాఖాన్ సక్సెస్ స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది.
ఎంతో పట్టుదల ఉంటే మాత్రమే సివిల్స్ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించడం సాధ్యమవుతుంది.ఇండియన్ ఫారిన్ సర్వీస్( Indian Foreign Service ) తన ప్రాధాన్యత అని ఆమె చెబుతున్నారు.ప్రపంచంలో భారత్ ను ఉన్నత స్థానంలో ఉంచడం లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
సివిల్స్ లో ర్యాంక్ సాధిస్తానని ఊహించాను కానీ టాప్ 20లో ర్యాంక్ వస్తుందని అస్సలు అనుకోలేదని ఆమె వెల్లడించడం గమనార్హం.
మంచి ర్యాంక్ సాధించడంతో కుటుంబ సభ్యులు ఎంతగానో సంతోషిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.హిస్టరీ, జియో పాలిటిక్స్ అంటే నాకు చాలా ఇష్టమని వార్ధాఖాన్ అన్నారు.కాలేజ్ లో చదివే సమయంలో నేను డిబేట్లలో ఎక్కువగా పాల్గొనేదానినని ఆమె తెలిపారు.2021 సంవత్సరం నుంచి నేను ప్రిపేర్ అవుతున్నానని రెండో ప్రయత్నంలో నేను సక్సెస్ అయ్యానని వార్ధాఖాన్ అన్నారు.వార్ధాఖాన్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.