బుల్లి తెర యాంకర్ గా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ( Anasuya ) ప్రస్తుతం వెండితెర నటిగా కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నారు.వెండితెర అవకాశాలను అందుకున్నటువంటి ఈమె ఏ మాత్రం ఖాళీగా లేకుండా వరుస సినిమా అవకాశాలతో బిజీగా గడుపుతున్నారు.
ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి అనసూయ మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
కొన్నిసార్లు అనసూయ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు పెద్ద ఎత్తున వివాదాలకు కూడా కారణం అవుతూ ఉంటాయి.అయితే తాజాగా అనసూయ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటించారు. అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పారు.
ఈ క్రమంలోనే నెటిజన్ మీరు ఒంటరిగా ఒక ట్రిప్( Trip )ప్లాన్ చేయవచ్చు కదా.అని అడిగాడు.ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ.
ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలంటే నాకు పిచ్చ భయం.కానీ ఇప్పుడు ఆలోచిస్తా.ఎక్కడికి వెళితే బెటర్? ఒక సలహా ఇవ్వమని అనసూయ సదరు నెటిజెన్ ని అడిగింది.మరో నెటిజన్ మీరు ఎక్కడకి వెళ్లినా అక్కడ పండగే అని కామెంట్ చేయగా అనసూయ రిప్లై ఇస్తూ సో స్వీట్ అఫ్ యు అంటూ కామెంట్ చేశారు.ఇలా ఇలా ఒంటరిగా ఎక్కడికైనా ప్లాన్ చేయాలి అంటూ కామెంట్ చేయడంతో మరికొందరు దీనిని నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు.
భర్తను వదిలేసి ఒంటరిగా ఒక్కదానివే ఎంజాయ్ చేయడానికి వెళుతున్నావా అంటూ మరికొందరు ఈ పోస్టు పట్ల నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. అనసూయ ఏ విధమైనటువంటి పోస్ట్ చేసిన కొందరు ఉద్దేశపూర్వకంగానే ఆమెపై ఇలాంటి నెగటివ్ ట్రోల్స్ చేస్తూ ఉంటారు.
వాటన్నింటినీ కూడా అనసూయ ఇటీవల కాలంలో పెద్దగా పట్టించుకోవడం మానేసారనీ చెప్పాలి.