ఏపీలో ఎన్నికలు( AP election ) సమీపిస్తున్న తరుణంలో అందరి చూపు ఆ రాష్ట్రంపైనే ఉంది.వచ్చే నెల 13వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కోలాహలం మొదలైంది.
ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి.మరోవైపు ఓటర్ నాడిని పసిగట్టేందుకు వివిధ సంస్థలు సర్వేలను నిర్వహిస్తున్నాయి.
ఏపీలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపిస్తున్నారనే దానిపై సర్వేలు చేస్తున్నాయి.
ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.ఏ పార్టీ మెజార్టీ స్థానాలను దక్కించుకుంటుందనే విషయాలపై ఇప్పటికే పలు మీడియా సంస్థలు, సర్వే సంస్థలు తమ ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే.తాజాగా నేషనల్ మీడియా సంస్థ టైమ్స్ నౌ తన సర్వే ఫలితాలను ప్రకటించింది.
ఈ క్రమంలో ఏపీలో అత్యధిక ఎంపీ స్థానాలను వైసీపీనే గెలుచుకుంటుందని పేర్కొంది.
టైమ్స్ నౌ( Times Now ) నిర్వహించిన సర్వేలో భాగంగా ఏపీలో వైసీపీ మరియు కూటమి మధ్య పోరు హోరాహోరీగా సాగనున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష టీడీపీకి మధ్య పోటీ రసవత్తరంగా కొనసాగనుందని సర్వేలో తేలింది.రాష్ట్రంలో ఉన్న 25 లోక్ సభ స్థానాల్లో అత్యధికంగా 19 నుంచి 20 ఎంపీ స్థానాలను వైసీపీ( YCP ) గెలిచే అవకాశం ఉందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి.
తరువాత విపక్ష టీడీపీ మూడు నుంచి నాలుగు లోక్ సభ స్థానాలను గెలిచే అవకాశం ఉందని పేర్కొంది.ఇక బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించే ఛాన్స్ ఉండగా.
జనసేనకు ఆ అవకాశం లేదని సర్వే ఫలితాల్లో స్పష్టం అయింది.అదేవిధంగా ఈ గణాంకాల ప్రకారం అసెంబ్లీ స్థానాల్లో కూడా వైసీపీనే అత్యధిక సీట్లను సాధించి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే పలు సర్వే ఫలితాలు ఈసారి కూడా వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెప్పిన సంగతి తెలిసిందే.