జనగామ వ్యవసాయ మార్కెట్( Janagama Agricultural Market ) వద్ద ఉద్రిక్తత నెలకొంది.మార్కెట్ లో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై వివాదం చెలరేగింది.
దీంతో మార్కెట్ యార్డులో రైతులు( Farmers ) ఆందోళన కార్యక్రమం చేపట్టారు.తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్కెట్ యార్డు ఛాంబర్ లోకి వెళ్లిన రైతులు నిరసనకు దిగారు.
గత నాలుగు రోజులుగా తమ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ధాన్యమంతా నల్లబడి ముక్కిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రైతుల నిరసన నేపథ్యంలో మార్కెట్ వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.