ఏపీలోని వాలంటీర్లందరూ( AP Volunteers ) వైసీపీ కార్యకర్తలే అని చాలా సందర్భాల్లో స్వయంగా చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.వాలంటీర్ల వ్యవస్థను చులకన చేసే విధంగా పలు సందర్భాల్లో చంద్రబాబు నాయుడు కామెంట్లు చేశారు.
అయితే 2024 ఎన్నికల సమయానికి చంద్రబాబుకు వాలంటీర్ల సేవల యొక్క పవర్ ఏంటో అర్థమైంది.కూటమి అధికారంలోకి వచ్చినా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాల్సిందే అని క్లారిటీ వచ్చేసింది.
వాలంటీర్ల వేతనాన్ని డబుల్ చేసిన చంద్రబాబు ఇంత చేసినా వాలంటీర్ల ఓట్లు తనకే పడతాయని నమ్మడం లేదు.వైసీపీకి( YCP ) అనుకూలంగా వందల సంఖ్యలో వాలంటీర్లు ఇప్పటికే తమ ఉద్యోగాలకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
చంద్రబాబు నాయుడు కష్టం చూస్తే జాలేస్తోందిగా అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
కూటమి అధికారంలోకి వస్తే పింఛన్లు పెంచుతానని వాలంటీర్లకు రెట్టింపు జీతాలు ఇస్తానని జగన్ ప్రస్తుతం ఇస్తున్న మొత్తంతో పోల్చి చూస్తే ఎక్కువ బెనిఫిట్ కలిగేలా చూస్తానని చెబుతున్నా అప్పులు చేయకుండా ఈ పథకాల అమలు సాధ్యమేనా అని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే ఉన్న అప్పులు తీర్చడానికి చాలా సమయం పట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
వాలంటీర్లకు చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చినా వృథా ప్రయాసేనని వాళ్లు ఆ హామీలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరని వైసీపీ నేతలు చెబుతున్నారు.వైసీపీ త్వరలో మేనిఫెస్టో( YCP Manifesto ) ప్రకటించనుందని తెలుస్తోంది.అమలు చేసే హామీలను మాత్రమే ప్రకటిస్తామని వైసీపీ చెబుతోంది.
టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పొత్తు పెట్టుకున్నా ఒక పార్టీ నేతలు మరో పార్టీకి సహకరించుకోవడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఏపీ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.
ఏ రాజకీయ పార్టీ రాష్ట్రంలో అనుకూల ఫలితాలు సాధిస్తుందో చూడాలి.