ఏపీ సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) మేమంతా సిద్ధం బస్సు యాత్ర( Memantha Siddham Bus Yatra ) ద్వారా విజయవాడలో పర్యటన కొనసాగిస్తుండగా జగన్ లక్ష్యంగా ఆయనపై పదునైన వస్తువుతో దాడి జరిగింది.ఆ వస్తువు వల్ల జగన్ కు గట్టి గాయమైంది.
శనివారం రాత్రి 8 గంటల 10 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.జగన్ కు ఎడమ కంటి కనుబొమ్మ పై భాగాన బలమైన గాయమైంది.
ఈ ఘటనలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయపడ్డారు.
సీఎం జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఈ తరహా కుట్రలకు తెర లేపారనే అనుమానాలు ఉన్నాయి.
జగన్ ప్రచారం చేస్తున్న ప్రాంతానికి పక్కనే ఉన్న స్కూల్ నుంచి ఒక వ్యక్తి జగన్ పై దాడి( Attack On CM Jagan ) చేసినట్లు అనుమానాలు ఉన్నాయి.ఇప్పటికే పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
జగన్ పై ఎయిర్ గన్ తో హత్యాయత్నానికి ప్రయత్నించారనే ప్రచారం కూడా జరుగుతోంది.

మరి కొందరు మాత్రం క్యాటర్ బాల్ ను ఉపయోగించారని చెబుతున్నారు.ముందస్తు కుట్రలో భాగంగానే ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది.వైసీపీ( YCP ) వర్గాలు ఇప్పటికే పలువురు నేతలపై అనుమానాలు వ్యక్తం చేస్తుండగా ఆ అనుమానాలు నిజమో కాదో విచారణలో తెలిసే అవకాశం ఉంది.
జగన్ ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో సీఎం జగన్ కు చికిత్స జరిగింది.ఈరోజు యాత్రకు విరామం ప్రకటించిన వైఎస్ జగన్ ఈరోజు రాత్రి తదుపరి షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉంది.జగన్ కు వ్యతిరేకంగా పని చేసే పత్రికలలో ఒక పత్రిక జగన్ పై రాళ్ల దాడి జరిగిందని కూడా ప్రచురించలేదంటే జగన్ అంటే ఎంత ద్వేషమో అర్థమవుతుంది.
టీడీపీ( TDP ) ట్విట్టర్ ద్వారా జగన్ పై జరిగిన దాడి గురించి చేసిన పోస్ట్ ల గురించి సైతం విమర్శలు వ్యక్తమవుతున్నాయి.