అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్( US National Security Advisor Jake Sullivan ) వచ్చే వారం భారత పర్యటనకు రానున్నారు.ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య సాంకేతిక సహకారం భారత్-అమెరికాల మధ్య బంధాలను( India-America Relations ) తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు గాను భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా పలువురు ప్రముఖులను కలుసుకుంటారు.
వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సుల్లివన్ భారత్‌కు రావాల్సి వుంది.అయితే తీరిక లేని షెడ్యూల్, ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
తాజా భారత పర్యటనలో భాగంగా ‘‘ Critical and Emerging Technologies (iCET) ’’పై వార్షిక సమీక్షా సమావేశంలో అజిత్ దోవల్‌తో సుల్లివన్ చర్చలు జరుపుతారు.
రక్షణ, సాంకేతికత వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు అమెరికా ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు, పరిశ్రమ ప్రముఖులతో సమావేశాల కోసం భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా( Vinay Mohan Kwatra ) అమెరికాకు వెళ్లిన వెంటనే సుల్లివన్ భారత్‌కు వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.మా ద్వైపాక్షిక సంబంధాల అంశాలు, ఇండో పసిఫిక్ ప్రాంతంపై పరిణామాలు, సాంకేతిక సహకారంలో తదుపరి దశల గురించి చర్చించేందుకు సుల్లివన్ వచ్చేవారం భారతదేశంలో పర్యటిస్తారని వైట్‌హౌస్ అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారి చెప్పారు.ఏప్రిల్ 9 నుంచి అమెరికా పర్యటనలో వున్న జపాన్ ప్రధాని కిషిదా ఫుమియో అధికారిక పర్యటనను ప్రివ్యూ చేస్తూ బుధవారం సదరు అధికారి ఈ వివరాలు వెల్లడించారు.
అమెరికా-భారత్ మధ్య బలమైన సంబంధాన్ని ఏర్పరచడానికి అధ్యక్షుడు బైడెన్( President Biden ) చేసిన కృషి ఆయన గర్వపడే విషయాలలో ఒకటని సదరు అధికారి అన్నారు.ఇండో పసిఫిక్ , హిందూ మహాసముద్రం, సాంకేతికత వంటి కీలకమైన సమస్యలపై ఇరుదేశాలు గతంలో కంటే మరింత సన్నిహితంగా పనిచేస్తున్నాయని తాను నమ్ముతున్నట్లు ఆ అధికారి అన్నారు.భారత్ – అమెరికా సంబంధాలు సానుకూల దిశలో సాగుతున్నాయని భద్రత, గూఢచార, సాంకేతికత, పీపుల్ టూ పీపుల్ ఎంగేజ్‌మెంట్ అద్భుతంగా వుందని ఆయన చెప్పారు.యాదృచ్ఛికంగా. యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్( US Defense Secretary Lloyd Austin ) చట్టసభ సభ్యులతో మాట్లాడుతూ భారత సైన్యం సామర్ధ్యాలను బలోపేతం చేయడం ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో మరింత స్థిరమైన సమతుల్యతను కొనసాగించడానికి రెండు దేశాలు కలిసి పనిచేయవచ్చన్నారు.