అక్కడ సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా ' రాజు ' గారి రచ్చ తప్పదా ? 

ఇటీవలే టిడిపిలో చేరిన ఎంపీ రఘురామకృష్ణంరాజు( Raghurama Krishnam Raju ) వ్యవహారం అప్పుడే ఆ పార్టీలో పెద్ద తలనొప్పిగా మారింది.నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయనను అభ్యర్థిగా పోటీ చేయించాలని భావించినా,  ఆ సీటు పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించడం,  అక్కడ బిజెపి తమ అభ్యర్థిగా శ్రీనివాస వర్మ ను( Srinivasa Varma ) ప్రకటించడంతో రఘురాం కృష్ణంరాజు కు తప్పనిసరిగా అసెంబ్లీ సీట్ ను  కేటాయించాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఏర్పడింది.

 Suspense On Tdp Leader Raghurama Krishnam Raju Ticket Details, Tdp, Chandrababu,-TeluguStop.com

బిజెపి అభ్యర్థి శ్రీనివాస్ వర్మను మార్చి , ఆస్థానంలో రఘురామను టిడిపి అభ్యర్థిగా పోటీకి దింపుతారు అనే ప్రచారం జరిగినా,  అభ్యర్థిని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చేదే లేదని,  శ్రీనివాస్ వర్మ బరిలో ఉంటారని బిజెపి ఎన్నికల ఇన్చార్జి సిద్ధార్థ సింగ్ నాథ్ ప్రకటన చేయడంతో ఈ విషయంలో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.దీంతో రఘురాం కృష్ణంరాజుకు నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఉన్న ఉండి నియోజకవర్గం టిడిపి టికెట్( Undi TDP Ticket ) ఇస్తారని ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతుంది.

దీంతో ఉండి టిడిపిలో ఈ వ్యవహారం రచ్చగా మారింది.

Telugu Chandrababu, Jagan, Sapurammp, Undi Mla Ticekt, Ysrcp-Politics

ఇప్పటికే టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు( Mantena Ramaraju ) ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.టిడిపి ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు ఉంది.అంతకుముందు టిడిపి ( TDP ) సిట్టింగ్ లు అందరికీ టికెట్లు కేటాయిస్తున్నామని చంద్రబాబు ప్రకటించడంతో,  రామరాజు సీటుకు డోకా లేదని అంత భావించారు .అయితే రఘురామ కృష్ణంరాజు ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించడంతో రామరాజును బుజ్జగించి రఘురాం కృష్ణంరాజుకు ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే ప్రచారం టిడిపిలో గత కొద్ది రోజులుగా జరుగుతుంది.ఇప్పటి వరకు రఘురామ కృష్ణంరాజుకు ఎక్కడా సీటు ఇవ్వలేదు.

అయితే ఉండి పైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు.

Telugu Chandrababu, Jagan, Sapurammp, Undi Mla Ticekt, Ysrcp-Politics

ఇక్కడ నుంచి రామరాజును మారిస్తే ఊరుకునేది లేదని, రచ్చ తప్పదంటూ ఉండి టిడిపి నేతలు టిడిపి అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేయడంతో , ఈ విషయంలో ఏం చేయాలనే విషయంపై టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) డైలమాలో పడ్డారు.అలా అని రఘురామ కృష్ణంరాజుకు ఎక్కడా సీట్ కేటాయించకపోతే ఆయన ఊరుకోరని , ఖచ్చితంగా టిడిపికి నష్టమే చేస్తారనే భయమూ చంద్రబాబులో కనిపిస్తోంది.దీంతో ఉండి నియోజకవర్గ విషయంలో ఏం చేయాలనే డైలమాలో చంద్రబాబు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube