2024 ఏపీ ఎన్నికల్లో( 2024 AP Elections ) హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గాలలో హిందూపురం నియోజకవర్గం ఒకటి .వైసీపీ నుంచి టీడీపీకి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో బాలయ్య( Balakrishna ) మళ్లీ ఎమ్మెల్యేగా గెలవడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
గతంలో హిందూపురం నియోజకవర్గంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని వైసీపీ ముందడుగులు వేస్తుండటంతో బాలయ్య ఈసారి ప్రచారంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సరికొత్త హామీలను ప్రకటించాల్సి ఉంది.హిందూపురం నియోజకవర్గానికి( Hindupuram Constituency ) మేలు చేసేలా బాలయ్య కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు.
ఆస్పత్రులను నిర్మించడంతో పాటు తాగునీటి సమస్యలను పరిష్కరించారు.

తక్కువ ధరకే పేద ప్రజలకు భోజనం అందించి మంచి మనస్సును చాటుకున్నారు.హిందూపురంలో శుభకార్యాలకు హాజరయ్యే విషయంలో సైతం బాలయ్య ముందువరసలో ఉంటారు.అయితే బాలయ్య ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండరనే విమర్శ ఉంది.
క్రోధి నామ సంవత్సరం( Krodi Nama Samvatsaram )లో బాలయ్య జాతకం గురించి జ్యోతిష్కులు(Astrologers ) ఆసక్తికర విషయాలను వెల్లడించారు.బాలయ్య సినీ రంగంలో సంచలన విజయాలను అందుకుంటారని రాజకీయ రంగం( Political Field )లో మాత్రం విముఖత ఉంటుందని జ్యొతిష్కులు పేర్కొన్నారు.
రాజకీయ పరంగా ఇతరుల ద్వారా ఈయనకు అనుకూల ఫలితాలు ఉంటాయని జ్యోతిష్కులు వెల్లడించడం గమనార్హం.

బాలయ్య షూటింగ్స్ కు కొంత కాలం బ్రేక్ తీసుకోగా హిందూపురంలో గత 40 సంవత్సరాల నుంచి టీడీపీ( TDP )కే అనుకూల పరిస్థితులు ఉన్నాయి.వైసీపీకి అనుకూల పరిస్థితులు ఉన్న సమయంలో సైతం హిందూపురంలో బాలయ్య సత్తా చాటారు.బాలయ్య రాబోయే రోజుల్లో అటు సినీ ఇటు పొలిటికల్ రంగంలో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
బాలయ్యకు గత కొన్నేళ్లుగా సినిమాల పరంగా వరుస విజయాలు దక్కుతుండగా రాబోయే రోజుల్లో సైతం బాలయ్యకు భారీ బ్లాక్ బస్టర్ హిట్లు దక్కాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.బాలయ్య పారితోషికం( Balakrishna Remuneration ) విషయంలో సైతం ఇతర హీరోలకు అందని స్థాయిలో ఉన్నారు.